Hyderabad Road Naming: ‘తెలంగాణ తెలంగాణ రిసైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సమావేశం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరబాద్ కేంద్రంగా జరుగనున్నాయి. ఈమేరకు ఫ్యూచర్ సిటీలోని వంద ఎకరాల్లో రేవంత్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లుచేసింది. ఈ సదస్సుకు దేశంతోపాటు వివిధ దేశాల నుంచి 2 వేల మందికిపైగా ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణ భవిష్యత్ మారిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సమ్మిట్‌కు ముందు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
లాండ్ మార్కులకు అంతర్జాతీయ గుర్తింపు..
తెలంగాణ పభుత్వం గ్లోబల్ వ్యక్తిత్వాల పేర్లతో నగరంలోని ముఖ్యమైన రహదారులను, లాండ్‌మార్కులను ప్రత్యేకంగా డిజైన్ చేయాలని భావిస్తోంది. గూగుల్ స్ట్రీట్, విప్రో జంక్షన్, మైక్రోసాఫ్ట్ రోడ్ వంటి సంస్థల పేర్లతోను అవార్డులు ఇవ్వాలని పలు ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే నిమిషిక నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి లింక్ చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రాడియల్ రోడ్‌కు ‘పద్మభూషణ్ రత్నటాటా’ పేరు పెట్టారు. రవిర్యాల ఇంటర్చేంజ్‌ను ‘టాటా ఇంటర్చేంజ్’గా పేరు మార్చటం కూడా గౌరవప్రదమైన విషయంలో ఒకటి.
కేంద్రం అనుమతితో ట్రంప్ పేరు..
యునియన్ మంత్రిత్వ శాఖ, యుఎస్ ఎంబసీతో అనుమతులు పొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు అధికారికంగా ఖరారవుతుంది. ఈ చర్య హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే అవకాశాలతో చక్కగా నిలుస్తుంది.
ఢిల్లీలో జరిగిన యుఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈమేరకు ప్రతిపాదించారు. ఇప్పుడు దానిని అమలు చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న అంతర్జాతీయ స్థాయి విలువను ఇది ప్రతిబింబిస్తోందని భావిస్తున్నారు.