https://oktelugu.com/

Kanguva First Review: సూర్య ‘కంగువ’ మొట్టమొదటి రివ్యూ..సూర్య కెరీర్ లోనే ఇలాంటి ఫస్ట్ హాఫ్ ని చూసుండరు!

ట్రైలర్ లో కేవలం ఒక వెర్షన్ ని మాత్రమే చూపించారని. రెండవ వెర్షన్ ని ఇప్పటి వరకు అభిమానులకు చూపించలేదని, ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుందని,ఇలాంటి కాన్సెప్ట్ తో ఈమధ్య కాలం లో సినిమా రాలేదని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 05:50 PM IST

    Kanguva First Review

    Follow us on

    Kanguva First Review: సౌత్ ఇండియాలో గత పదేళ్ల నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూర్య ముందు వరుసలో ఉంటాడు. ‘సింగం 2’ సూర్య చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవుతూ వచ్చింది. ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీం’ వంటి మంచి సినిమాలు నేరుగా ఓటీటీ లో విడుదలయ్యాయి. ఇవి థియేటర్స్ లో విడుదల అయ్యుంటే సూర్య కి మంచి హిట్స్ పడేవేమో అని ఆయన అభిమానులు అభిప్రాయపడ్డారు. సూర్య నుండి థియేటర్స్ లో విడుదలైన చివరి చిత్రం ‘ఈటీ’. 2022 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ సూర్య నుండి మరొక సినిమా రాలేదు. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం లో ‘రోలెక్స్’ అనే అతిథి పాత్ర ద్వారానే ఆయన ఆడియన్స్ కి వెండితెరపై కనిపించాడు.

    ఈ పాత్ర ఆయనకీ యూత్ లో చాలా కాలం తర్వాత మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన ప్రముఖ దర్శకుడు శివ తో కలిసి ‘కంగువ’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేసాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో నవంబర్ 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైంది. రీ రికార్డింగ్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. రీసెంట్ గానే ఈ సినిమా తెలుగు వెర్షన్ కాపీ ని కొంతమంది తెలుగు నిర్మాతలకు చూపించారట. వారి నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కి అయితే తిరుగులేని రిపోర్ట్స్ వెలువడుతున్నాయి. ఈమధ్య విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో ఎదో ఒక లోపం ఉండడాన్ని గమనించామని, కానీ ‘కంగువ’ చిత్రంలో ఒక్క మైనస్ ని కూడా కనిపెట్టలేకపోయామని, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత స్టామినా ఈ సినిమాకి ఉందని, సూర్య అసలు సిసలు కం బ్యాక్ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని పొగడ్తలతో ముంచి ఎత్తారట. టైం మెషిన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

    ట్రైలర్ లో కేవలం ఒక వెర్షన్ ని మాత్రమే చూపించారని. రెండవ వెర్షన్ ని ఇప్పటి వరకు అభిమానులకు చూపించలేదని, ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుందని,ఇలాంటి కాన్సెప్ట్ తో ఈమధ్య కాలం లో సినిమా రాలేదని అంటున్నారు. మరి ఈ రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం స్టూడియో గ్రీన్ సంస్థ దాదాపుగా 300 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. సూర్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.