Rishabh Pant: రిషబ్ పంత్ కు ఏమైంది?.. చర్చనీయాంశంగా ఇన్ స్టా పోస్ట్..

టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మైదానం ఏదైనా సరే.. ప్రత్యర్థి ఎవరైనా సరే.. బౌలర్ ఎవరైనా సరే పట్టించుకోవడం లేదు. దూకుడుగా ఆడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 5:46 pm

Rishabh Pant

Follow us on

Rishabh Pant: న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 99 పరుగులు చేశాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అయినప్పటికీ అత్యంత కష్టాల్లో ఉన్న జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అయినప్పటికీ భారత్ కు న్యూజిలాండ్ చేతిలో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి అనంతరం రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాని వెనుక ఉన్న అర్ధాన్ని అతడు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు..” చాలా సందర్భాల్లో మనం మౌనంగా ఉండడం మంచిది.. దేవుడినే మనుషులను చూడనిద్దామని” అందులో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ కు పై భాగంలో ఒక పక్షి ఈకను ఉంచాడు. ఆ పక్షి ఈకలో రకరకాల చిత్రాలు కనిపిస్తున్నాయి. సగం నెలవంక, అర్ధకారంలో ఉన్న చక్రం.. వికసిస్తున్న పుష్పం వంటివి అందులో ఉన్నాయి. అయితే వాటికి అర్థం ఏమిటనేది రిషబ్ చెబితే గాని తెలియదు. అయితే ఈ పోస్టుపై అభిమానంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దాని వెనుక ఏం జరిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో రిషబ్ పంత్ ఎండవేడికి తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు జరిగిన తొలి ఇన్నింగ్స్ లోనూ అతడు సరిగ్గా ఆడ లేకపోయాడు. దీంతో అతడు మిగతా టెస్టులు ఆడే అవకాశం లేదా? అందువల్లే అతడు ఈ పోస్ట్ పెట్టాడా? జట్టులో ఏమైనా అంతర్గతంగా చర్చలు జరిగాయా? అనే కోణాలలో అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు రిషబ్ పంత్ సుదీర్ఘకాలం క్రికెట్ కు దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. టి20 వరల్డ్ కప్, బంగ్లాదేశ్ టోర్నీ లో సత్తా చాటాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో ఒక పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. తొలి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రిషబ్ ఆట తీరు పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ రిషబ్ పంత్ ఎందుకు ఆ పోస్ట్ పెట్టాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ” రిషబ్ అలా ఎందుకు పోస్ట్ చేశాడో తెలియదు. జట్టులో ఏదో జరిగి ఉంటుంది.. అందువల్లే అతడు అలాంటి పోస్ట్ చేసి ఉంటాడని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.