Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో( AP deputy CM Pawan Kalyan) గొప్ప సమైక్యతా భావం ఉంటుంది. ముఖ్యంగా దేశాభిమానం కనిపిస్తుంది. అయితే భారతదేశాన్ని నిలబెట్టింది మాత్రం ధర్మం అని గట్టిగా నమ్ముతారు పవన్ కళ్యాణ్. తాజాగా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమిళనాడులో ఓ పీఠాధిపతి ఆహ్వానం వరకు అక్కడకు వెళ్లారు. భగవద్గీత పై కీలక ప్రసంగం చేశారు. ఆధ్యాత్మిక ప్రసంగం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ఎంతో ఆలోచింపజేసింది. 2024 ఎన్నికలకు ముందు తన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని.. కానీ లోక కళ్యాణార్థం.. ఏపీ ప్రజల సంక్షేమం కోసం ధర్మం వైపు నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. కురుక్షేత్రంలో అర్జునుడి పాత్ర తనది అంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. తద్వారా వైసీపీని కౌరవ సైన్యంతో పోల్చారు. కేవలం ధర్మం కోసం మాత్రమే తాను చంద్రబాబు పక్షాన నిలబడ్డానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* ప్రత్యేక ఆహ్వానంతో.. కర్ణాటకలోని( Karnataka) ఉడిపి పర్యాయ పుట్టేగా శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ఆహ్వానం మేరకు పవన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా భగవద్గీత గురించి పవన్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అది అందర్నీ ఆకట్టుకుంది. గీత బోధన చేసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా రకాల సందిగ్ధతలు తొలగించారని.. తనకు వ్యక్తిగత లాభనష్టాలు కంటే రాష్ట్ర ప్రజల సమగ్ర మేలు ప్రధానమని భావించి 2024 ఎన్నికల కు ముందు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయి పోటీ చేయాల్సి వచ్చింది అందుకేనని చెప్పుకొచ్చారు. భగవద్గీత అనేది పూజ గదిలో పెట్టుకునేది కాదని.. ప్రతి మనిషి జీవితానికి పనికి వచ్చే గొప్ప జీవిత సారాంశం అని పవన్ చెప్పారు.
* ఆకట్టుకున్న ప్రసంగం..
నిజజీవితంలో ఎదురైన పరిణామాలను భగవద్గీత( Bhagavad Gita ) సారాంశాలతో పోల్చుతూ పవన్ ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆలోచింపజేసింది కూడా. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలో టిడిపి తో పొత్తు ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పటివరకు టిడిపి తో విభేదించిన బిజెపిని సైతం ఒప్పించారు. ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి పొత్తు విచ్చిన్నంపై. కానీ వాటన్నింటినీ అదిగమించి పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను ఒకచోట చేర్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. పవన్ మాటలను చూస్తుంటే ధర్మంపై నిలిచానని.. కౌరవ సైన్యంగా వైసీపీని అభివర్ణించారు.