Credit card : ప్రస్తుత కాలంలో చాలామంది వద్ద క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉంటున్నాయి. సాధారణ ఆదాయం పొందే వారికి సైతం బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందించాయి. దీంతో కొన్ని అవసరాల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. ముందస్తు అప్పుగా భావించే ఈ క్రెడిట్ కార్డుతో అత్యవసర సేవలను కూడా వినియోగించుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు రుణం తీసుకోవచ్చు. కొత్తగా పెట్టుబడును కూడా పెట్టవచ్చు. అయితే ఇదే సమయంలో బంగారం ను క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి పరిమితులు ఉంటాయి? ఎలాంటి నష్టాలు ఉంటాయి?
Also Read : బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా?
ప్రస్తుత కాలంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంది. 2025 ప్రారంభ సంవత్సరం నుంచి బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగాయి. కొంతమంది స్టాక్ మార్కెట్ నుంచి బయటపడి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడుల దారులకు అనుగుణంగా బంగారం కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే చాలామందికి బంగారం పై పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి ఉన్న అవసరానికి అందుబాటులో డబ్బులు ఉండవు. ఇదే సమయంలో క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత అవసరం లేనప్పుడు దానిని విక్రయించాలని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఎంత లాభం అవుతుందనేది తెలుసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రస్తుతం క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనడానికి అనుమతులు లేవు. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం కొనడానికి అనుమతులు ఇచ్చాయి. కానీ ఈ కార్డుల ద్వారా బంగారం కొనుగోలు చేస్తే రెక్కింపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బంగారం కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ శాతమే భరించాల్సి వస్తుంది.
క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఈఎంఐ గా మార్చే అవకాశం లేదు. అందువల్ల మీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. లేకుంటే పెనాల్టీ భారీగా పడే అవకాశం ఉంటుంది. బంగారం ధర ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. క్రెడిట్ కార్డు ద్వారా అత్యధిక ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత బంగారం తగ్గితే తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఉండడం వల్ల నష్టం ఉండే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేసిన మొత్తాన్ని సమయానికి చెల్లించకపోతే భారీ వడ్డీ భరించాల్సి వస్తుంది. ఇది సాధారణ ఈఎంఐ కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ మొత్తంలో నష్టపోతారు.
క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ కార్డు పై వచ్చే రివార్డులు, క్యాష్ బ్యాక్ వంటివి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం కొనుగోలు చేస్తే రుణభారం పెరిగిపోతుంది. దీనివల్ల అత్యవసరంగా రిటర్న్ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అదనపు భారంగా మరి ఆర్థిక భారం ఏర్పడుతుంది.
Also Read : క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి ఆర్.బి.ఐ సంచలన ప్రకటన..