Gold Loan : జీవితంలో డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే దీనిని పొందగలరు. అయితే ఆదాయం తక్కువగా ఉన్నవారు కొన్ని అవసరాల నిమిత్తం ఇతరుల వద్ద అప్పు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి అధిక వడ్డీ చెల్లించేవారు. అంతేకాకుండా అప్పు పొందడానికి అనేక ప్రయాసలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బ్యాంకులో రుణాలను త్వరగా మంజూరు చేస్తున్నాయి. ఇదే సమయంలో గోల్డ్ కనుక ఉంటే రుణాలను మరింత ఈజీగా అందిస్తున్నాయి. మిగతా రుణాల కంటే బంగారు నగలపై తీసుకుని రుణాలు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది బంగారు నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. అయితే ఈ రుణం తీసుకునే సమయంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. ఇంతకీ ఏ విషయాలపై జాగ్రత్తగా ఉండాలంటే?
Also Read : మఖానా వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్.. తక్కువ ఖర్చుతో లక్షల్లో లాభాలు…
ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు లక్ష దాటింది. ఇలాంటి సమయంలో బంగారు నగలపై అధిక రుణ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. రిజర్వు బ్యాంకు రూల్స్ ప్రకారం 10 గ్రాముల బంగారంపై 75% రుణాన్ని పొందవచ్చు. అంటే 10 గ్రాముల బంగారం రూ లక్ష రూపాయలు ఉంటే దీనిపై 75 వేల రుణం పొందవచ్చు. కానీ కొన్ని బ్యాంకులు లేదా సంస్థలు తక్కువ మొత్తం ఇవ్వాలని చూస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోకుండా ముందే ఆర్బిఐ రూల్స్ తెలుసుకొని బంగారు రుణం తీసుకోవాలి.
బంగారు రుణాలు తీసుకునే సమయంలో కొన్ని డాక్యుమెంట్లపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉండే వడ్డీ రేట్లు, నిబంధనలు తెలుసుకోవాలి. ఎందుకంటే రుణం తీసుకుని ఆత్రుతలో చాలామంది వీటిని చదవకుండా వదిలేస్తారు. కానీ కంపెనీ రూల్స్ ప్రకారం కొన్ని వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. అలాగే కంపెనీకి ప్రత్యేక రూల్స్ ఉండి అవి వినియోగదారులను ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. అందువల్ల వీటి గురించి ముందే తెలుసుకొని ఆ తర్వాత సంతకం పెట్టి రుణం తీసుకోండి.
బంగారు రుణాలు అందించే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు విధిస్తారు. అయితే ఇది ఎంత మొత్తంలో విధిస్తారో తెలుసుకోవాలి. వినియోగదారులకు అవగాహన లేదని గ్రహించిన చాలా సంస్థలు అధిక ప్రాసెసింగ్ ఫీజును విధిస్తారు. ఇది ఒక్కోసారి రుణంలో కొంత శాతం కూడా ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువ అయితే మిగతా సంస్థలో కూడా తెలుసుకొని అప్పుడు బంగారం తీసుకోవాలి.
సాధారణంగా బంగారు రుణాలపై ఆరు నెలల నుంచి 24 నెలలపాటు టెన్యూర్ ఉంటుంది. అయితే ఇంతకుమించి ఎక్కువగా టెన్యూర్ పెట్టుకోవడం వల్ల నష్టపోతారు. అవసరమనుకుంటే ఈ గడువు పూర్తయిన తర్వాత దానిని రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం టెన్యూర్ పెట్టుకోవడం వల్ల బంగారం ధరల్లో మార్పు వచ్చి వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల 24 నెలల లోపు మాత్రమే గడువు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.