Credit Cards : తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెల 2024తో ముగిసిన 12 నెలల కాలంలో క్రెడిట్ కార్డు విభాగంలో నిరర్థక ఆస్తులు కూడా 28.42%నికి తిరిగి రూ.6,742 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల 2023లో రూ.5,250 కోట్ల నుంచి ప్రస్తుతస్థాయికి స్థూల ఎంబీఏ లో పెరిగినట్లు తెలుస్తుంది. అయితే దాదాపుగా ఇది 1500 కోట్ల పెరుగుదలగా ఉంది. డిసెంబర్ 2024 నాటికి వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ కార్డు విభాగంలో ఉన్న రూ.2.92 లక్షల కోట్ల స్థూల రుణంలో దాదాపు 2.3% గా తెలుస్తుంది. గత ఏడాది ఉన్న రూ.2.53 లక్షల కోట్లా క్రెడిట్ కార్డ్ బకాయిలలో 2.06 శాతంగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆర్థిక సవాళ్లు, కరుణ విధానాలు మరియు తక్కువ ఆర్థిక అక్షరాస్యత వంటి పలు కారణాల వలన మన దేశంలో క్రెడిట్ కార్డు రుణవేగం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గిగ్ వర్కర్లు, ఎం ఎస్ ఎం ఈ లో ప్రమరహిత ఆదాయాలు ఈ సమస్యలను మరింత ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే 2023 సంవత్సరంలో 8 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. ఈ విధంగా ఆదాయ అస్థిరత 2024 వరకు కొనసాగింది. ఈ విధంగా ఏర్పడిన అస్థిరత మూలంగా చాలా మంది అవసరమైన ఖర్చులకోసం క్రెడిట్ కార్డులపై ఆధార పడవలసి వచ్చిందని రుణ చెల్లింపు వేదిక అయినా జావా వ్యవస్థాపకుడు కుందన్ షాహి చెప్పుకొచ్చారు.
Also Read : తాజాగా ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బిఐ.. కోట్లాది మందికి ఊరట..
అన్ని బ్యాంకులు దూకుడుగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.FY24 లో 102 మిలియన్లకు పైగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంకులు తక్కువ ఆదాయం ఉన్న వారిని లేదా మొదటిసారి రుణ గ్రహీతలను లక్ష్యంగా చేసుకొని బలమైన క్రెడిట్ తనిఖీలు లేకుండానే వాళ్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇలా సులభమైన యాక్సెస్ వెంటనే ఖర్చు చేయడానికి ఆజ్యం పోస్తుందని తెలుస్తుంది.
కానీ ఇది చాలామందిని రుణ ఉచ్చులకు గురి అయ్యేలా చేస్తుందని జావో నుంచి షాహి చెప్పుకొచ్చారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం కూడా పరిస్థితిని మరింత దిగజారే లాగా చేస్తుంది. క్రెడిట్ కార్డు ఉన్న కొంతమంది వినియోగదారులు బిల్లు చెల్లింపుల చివరి తేదీ వరకు కట్టుబడి ఉండటం ప్రాముఖ్యతను అర్థం చేసుకోరు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉన్న యువ వినియోగదారులు అనవసరమైన ఖర్చులకు గురవుతుంటారు.