Low Budget Cars : కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ ధరలో కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇదే సమయంలో మంచి ఫీచర్లు కూడా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా కంపెనీలు బెస్ట్ ఫీచర్లు ఉన్న కార్లు.. తక్కువ ధరకు అందించడానికి ఇష్టపడవు. కానీ కొన్ని మాత్రం వినియోగదారులను ఆకర్షించడానికి తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉన్న కార్లు మార్కెట్లోకి తీసుకువస్తాయి. వీటిలో కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం..
Also Read : 250 కిమీ రేంజ్‌తో టాటా నానో ఈవీ.. ధర ఎంతంటే ?
దేశంలోని ఆటోమోబైల్ రంగంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న TaTa కంపెనీ సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. TaTa కంపెనీకి చెందిన ఎన్నో కార్లు ఇప్పటికే వినియోగదారులను అలరించాయి. అయితే తక్కువ బడ్జెట్ లో అందించడానికి Punch మోడల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో అనేక ఆకట్టుకున్న ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికొస్తే.. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు యూఎస్ బీ చార్జింగ్ పోర్ట్ సౌకర్యం ఉంటుంది. అలాగే సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.
Hyundai కంపెనీకి చెందిన మరో కారు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.అదే ఎక్స్ టర్. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూా ఉంది. ఈ ఇంజిన్ 19.2 నుంచి 27.1 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 5గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లే ఈ కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనిని రూ.6.21 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 10.51 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నైట్ కారు లో బడ్జెట్ లో కొనుగోలు చేయొచ్చు ఇది ప్రస్తుతం మార్కెట్లో రూ.6.14 లక్షల నుంచి రూ. 11.76 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 1 లీటర్ టర్బో ఇంజిన్ ను అమర్చారు. ఇది లీటర్ ఇంధనానికి 17.4 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉండడంలో నిస్సాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
వీటితో పాటు మారుతి సుజకీ కంపెనీకి చెందిన బాలెనో బెస్ట్ డిజైన్ తో పాటు లో బడ్జెట్ కారుగా ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.6.70 లక్షల ప్రారంభ ధర నుంచి 9.92 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది లీటర్ కు 22.35 నుంచి 30.61 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
వీటితో పాటు మార్కెట్లో ఇదే బడ్జెట్ లో అనేక కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి మాత్రం ప్రత్యేక డిజైన్లను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్లు ప్రముఖ కంపెనీలకు చెందినవి కావడంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.
Also Read : బేస్ మోడల్‌లోనూ టాప్ సేఫ్టీ.. మారుతి సంచలన నిర్ణయం!