CIBIL Score : కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన మన సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. ఈ సిబిల్ స్కోర్ ని మళ్లీ ఎలా పెంచుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ నాలుగు సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వలన మీ సిబిల్ స్కోర్ ను భారీగా పెంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఒక్కో సమయంలో క్రెడిట్ కార్డును ఉపయోగించేటప్పుడు మీకు పెద్ద మొత్తంలో బిల్లులు వస్తాయి. ఆ సమయంలో మనం మినిమం బిల్లు పే చేసి ఔట్ స్టాండింగ్ అమౌంట్ అలాగే ఉంచేస్తాము. ఇలా చేయడం వలన కూడా సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా కట్టడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీరు ఈ ఎం ఐ రూపంలో కూడా ఈ బిల్లును చెల్లించవచ్చు. ఈ విధంగా చేయడం వలన సిబిల్ స్కోర్ దెబ్బ తినకుండా ఉంటుంది.
Also Read : లగ్జరీ లైఫ్ వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ నటుడు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
మీరు బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ లేదా వెహికల్ లోన్ వంటివి తీసుకున్నప్పుడు ఒక్కోసారి మీ చెల్లింపులు పూర్తి అయినా కూడా మీ అకౌంటు క్లోజ్ అవ్వకపోయినట్లయితే అందులో కొంత అమౌంట్ అలాగే ఉంటుంది. దీనిని కూడా మీరు నిర్లక్ష్యంగా వదిలేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. కాబట్టి లోన్ పూర్తి అయిన వెంటనే మీరు ఎన్వోసీ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరికైనా లోన్ కి గ్యారెంటీగా ఉంటున్నట్లయితే మీరు అతను సకాలంలో ఆ లోన్ వాయిదాలను కడుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఒకవేళ సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్ పై పడుతుంది.
కాబట్టి మీరు లోన్ గ్యారెంటీగా ఉన్నప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి మనము చిన్న చిన్న అవసరాలకు కూడా బ్యాంకులో లోన్స్ తీసుకుంటూ ఉంటాము. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఫైనాన్స్ పద్ధతిలో కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు చాలామంది. సకాలంలో వీటి వాయిదాలను చెల్లిస్తే మంచిది. లేకపోతే దీని ప్రభావం కూడా మీ సిబిల్ స్కోర్ పై ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినకుండా మీరు లోన్ పొందాలి అంటే మీరు బంగారంపై లోన్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్.