Nana Patekar : కెరియర్ ప్రారంభంలో సినిమాలలో హీరోగా కనిపించిన ఇతను ఆ తర్వాత సినిమాలలో తన వయసుకు తగిన పాత్రలలో నటించాడు. వైవిద్యమైన పాత్రలతో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ ప్రస్తుతం ఇతను కోట్లు, లగ్జరీ లైఫ్ వంటివి వదిలేసి ఒక చిన్న పల్లెటూరులో తనకు నచ్చిన ప్రశాంతమైన వాతావరణం లో జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ స్టార్ నటుడు తన దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో గానే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో సహాయక నటుడిగా కూడా కనిపించే తన నటనకు అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నటుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. కానీ లగ్జరీ లైఫ్ వదిలేసే ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ హీరో ఇందుకు గల కారణాన్ని అభిమానుల తో పంచుకున్నాడు. ఈ స్టార్ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్. నానా పటేకర్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు.
Also Read : హరిహర వీరమల్లు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది…ఆ రెండు సీన్లకు పూనకలు రావాల్సిందేనా..?
ఇతను హిందీలో ఎన్నో సినిమాలలో తన నటనతో మంచి ప్రశంసలు అందుకున్నారు. కానీ ఇప్పుడు పట్టణానికి దూరంగా మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. ముంబైలో ఈ స్టార్ నటుడికి ఇల్లు ఉన్నప్పటికీ కూడా షూటింగ్ సమయంలో మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు. అయితే ముంబైలో ఉన్న ఇల్లు వదిలి ఒక చిన్న గ్రామంలో ఉండేందుకు తనకు ఒక స్పెషల్ కారణం ఉందని కూడా ఆయన వివరించారు. ఆ చిన్న గ్రామంలో ఈ స్టార్ నటుడు కేవలం ప్రకృతి కోసం మాత్రమే కాకుండా అక్కడున్న మనుషులు మరియు జంతువుల మధ్య జీవిస్తానని తెలిపారు.

ఆ గ్రామంలో తనకు పది ఆవులు, ఎద్దులు, ఆరు కుక్కలు ఉన్నాయని అలాగే అంతకు మించిన పచ్చదనం తన ఇంటి ఆవరణ చుట్టూ ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త ఇల్లు కొనాలి లేదా కొత్త కార్లు కొనాలి అని ఆలోచనలో తనకు లేవని కానీ ఈ మధ్యకాలంలో తన ఇంటి ముందు గొట్టపు బావి తవ్వినప్పుడు తనకు చాలా ఆనందం కలిగిందని ఈ స్టార్ నటుడు చెప్పుకొచ్చారు. తానే ఉంటున్న గ్రామంలోని మనుషులతో తను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానని అక్కడున్న మనుషుల ప్రవర్తన చిన్న పిల్లల లాగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఖరీదైన బట్టలు లేదా ఖరీదైన వస్తువులు తనకు ఆనందాన్ని కలిగించవని తనకు సింపుల్ లైఫ్ అంటే చాలా ఇష్టమని నానా పటేకర్ చెప్పుకొచ్చారు.