Charging Cable : మీ ఫోన్ ఛార్జర్ వైర్ తెగిందా? పొరపాటున కూడా అలా ఛార్జ్ చేయకండి..అది ఎంత ప్రమాదకరమో తెలిస్తే షాకవుతారు. ఆపిల్ కంపెనీ దీని గురించి కొన్ని సూచనలు చేసింది..వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : మొబైల్ ఛార్జింగ్ పెడుతూ ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కేవలం మాట్లాడటానికి మాత్రమే పరిమితం కాలేదు. పేమెంట్ చేయడం నుంచి కరెంట్ బిల్లు కట్టడం వరకు చిన్న నుంచి పెద్ద పనులన్నీ మొబైల్ నుంచే అయిపోతున్నాయి. కానీ ఫోన్ వాడాలంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉండాలి. ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఛార్జింగ్ చేసే సరైన విధానం కూడా తెలుసుకోవాలి. చాలాసార్లు ఛార్జింగ్ కేబుల్ పాతదైపోయి అక్కడక్కడా తెగిపోతుంది. అయినా సరే చాలా మంది ఆ తెగిన వైర్‌తోనే ఫోన్‌ను ఛార్జ్ చేస్తూ ఉంటారు.
తెగిన వైర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తూ ఉండటం మంచిదేనా లేక ప్రమాదమా? ఈ విషయం గురించి ఆపిల్ కంపెనీ ఏం చెబుతుందో చూద్దాం. చాలాసార్లు ఛార్జింగ్ వైర్ తెగి ఉండటం వల్ల ఫోన్‌ను పదే పదే కదిలించాల్సి వస్తుంది. ఎందుకంటే ఛార్జింగ్ అవుతూ అవుతూ మధ్యలోనే ఆగిపోతుంది. అయితే, తెగిన వైర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఇంకా చాలా నష్టాలు కలుగుతాయి. దానిపై చాలా మంది అస్సలు శ్రద్ధ పెట్టరు. తెగిన వైర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం ప్రమాదకరం.
Also Read : రాత్రంతా ఫోన్ ఛార్జింగులో పెట్టి ఉంచుతున్నారా.. అయితే మీరు మూల్యం చెల్లించుకున్నట్లే
ఆపిల్ ఏం చెబుతోంది?
ఆపిల్ కంపెనీ తన సపోర్ట్ పేజీలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. పాడైపోయిన కేబుల్ లేదా ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తే మంటలు వచ్చే ప్రమాదం, కరెంట్ షాక్ వచ్చే ప్రమాదముంది. దాంతో తీవ్రగాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. తెగిన వైర్ తో ఛార్జ్ పెడితే ఫోన్ కూడా పాడైపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.