Akhanda 2 : సౌందర్య తర్వాత మన టాలీవుడ్ లో ఆ తరహా నటీమణులు కరువు అయ్యారు. అలాంటి సందర్భంలో తెలుగు ఆడియన్స్ సౌందర్య ని కొంతమంది తెలుగు హీరోయిన్స్ లో చూసుకునేవారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ(Laya). ఈమె మన టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే, కానీ చిరకాలం గుర్తించుకోదగ్గ సినిమాలు, పాత్రలే చేసింది. ఆ తర్వాత ఇక సినిమాలు చాలు అనుకొని, పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ, మరోపక్క సంసార జీవితాన్ని చూసుకుంటూ, మద్యమద్యలో డ్యాన్స్ క్లాసులు నిర్వహిస్తూ కాలాన్ని సాగించిన లయ, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నితిన్(Nithin), వేణు శ్రీరామ్(Venu Sriram) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రంలో ఒక ముఖ్యమైన క్యారక్టర్ చేసింది. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : అఖండ 2 లో యాక్షన్ డోస్ పెంచుతున్న బోయపాటి…
ఈ సినిమాతో పాటు శివాజితో కలిసి ఒక సినిమా చేసింది, అదే విధంగా ఆయనతో కలిసి ప్రతీ శుక్రవారం, శనివారం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షోలో ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇదంతా పక్కన పెడితే లయకు శ్లోక అనే అందమైన కూతురు ఉంది. ఈమె మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత ఈమె ఎలాంటి సినిమాలో కనిపించలేదు కానీ, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రం లో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. అఖండ చిత్రం లో ఒక చిన్న పాప క్యారక్టర్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఆడియన్స్ ని చాలా ఎమోషనల్ చేస్తుంది, ఈ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ చిన్న పాప సీక్వెల్ లో పెరిగి పెద్దది అవుతుంది, ఆ క్యారక్టర్ ని శ్లోక చేస్తుంది.
చూసేందుకు శ్లోకా అచ్చం వాళ్ళ అమ్మ లయకు జిరాక్స్ కాపీ లాగా అనిపిస్తుంది. కచ్చితంగా హీరోయిన్ గా సక్సెస్ అయ్యే లక్షణాలు ఈ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి. హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే, కచ్చితంగా ఈ ‘అఖండ 2’ లో ఈ అమ్మాయి క్యారక్టర్ క్లిక్ అవ్వాలి. అది జరిగితే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోతుంది అనొచ్చు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కి విడుదల చేయాలని ప్రయత్నం చేశారు కానీ, అది దాదాపుగా అసాధ్యం అని తేలడం తో సంక్రాంతికి వాయిదా పడింది. బాలయ్య కి సంక్రాంతి సీజన్ ఎంతలా కలిసొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కచ్చితంగా ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు.
Also Read : అయోమయంలో పడ్డ ‘అఖండ 2’ నిర్మాతలు..వెనకడుగు వేయక తప్పదా?