Kia Carens Clavis : కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియాలో సరికొత్త 7 సీటర్ కారును విడుదల చేసింది. ఈ కొత్త కారు 6, 7 సీటర్ ఎంపీవీ. కొత్త మోడల్‌కు కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) అని పేరు పెట్టారు. ఇది కారెన్స్ కొత్త మోడల్ అయినప్పటికీ ప్రస్తుత మోడల్ కంటే ఇది చాలా ప్రీమియంగా ఉండనుంది. కారెన్స్ క్లావిస్ లాంచ్ అయిన తర్వాత టయోటా ఇన్నోవా, మారుతి XL6 వంటి ప్రీమియం 7 సీటర్ కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. కంపెనీ త్వరలోనే దీని ధరను కూడా వెల్లడిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే.. క్లావిస్ పాత కారెన్స్ కంటే కంప్లీట్ డిఫరెంటుగా ఉంటుంది. ఇందులో కొత్త డిజైన్, అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కొత్త కారెన్స్ క్లావిస్ బుకింగ్‌లు ఈరోజు అర్ధరాత్రి నుండి కంపెనీ డీలర్‌షిప్‌లు, ఆన్‌లైన్‌లో రూ.25,000 టోకెన్ మొత్తంతో ప్రారంభం అవుతాయి. కొత్త కారెన్స్ క్లావిస్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. టర్బో పెట్రోల్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తుంది.
Also Read : కొత్త రికార్డు సృష్టించిన ‘కియా’..
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కియా కారెన్స్ క్లావిస్‌లో లెవెల్ 2 ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎంవీపీలో 20 కంటే ఎక్కువ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు చూడవచ్చు. ఈ మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, మొత్తం 18 యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ డిజైన్
కియా కారెన్స్ క్లావిస్ కొత్త ఎక్స్‌టీరియర్ స్టైల్‌తో వస్తుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫేసియా, స్టార్‌మ్యాప్ LED కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, 17-ఇంచ్ క్రిస్టల్-కట్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సాటిన్ క్రోమ్ ఫినిష్‌తో ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్స్, మెటల్ పెయింట్‌పై సైడ్ డోర్ గార్నిష్ ఇన్సర్ట్, కొత్త ఐవరీ సిల్వర్ గ్లాస్ బాడీ కలర్ వంటివి ఉన్నాయి. కియా భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను ఏడు ట్రిమ్‌లలో విడుదల చేయనుంది. అవి HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+.
Also Read : కియా సోనెట్ కొత్త మోడల్ చూశారా? ఫీచర్స్ అదిరిపోయాయి..
కారెన్స్ క్లావిస్ ఫీచర్లు
కియా కారెన్స్ క్లావిస్ ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇందులో ట్విన్ 26.62-ఇంచ్ పనోరమిక్ డిస్‌ప్లే, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఇన్-బిల్ట్ నావిగేషన్, బోస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బాస్ మోడ్‌తో కూడా వస్తుంది. ఈ మోడ్‌లో రెండవ వరుసలోని ప్రయాణీకుడు వెనుక నుంచి కో-డ్రైవర్ సీటును, లెగ్‌రూమ్‌ను కూడా అడ్జస్ట్ చేయవచ్చు.
