Budget EV Scooters in India 2026: ఇప్పుడు అంతా ఈవీ జనరేషన్. చిన్న స్కూటర్ నుంచి బస్సుల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం కారణంగా ప్రభుతావలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తయారీ సంస్థలు కూడా ఈవీలను కస్టమర్ల టేస్ట్‌కు తగినట్లుగా తయారు చేస్తున్నాయి. తాజాగా బజాజ్, టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేశాయి. రెండు దేనికదే ప్రత్యేకం. యువతను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
టీవీఎస్ ఆర్బిటర్ సరళమైన, ఆధ్యాత్మిక లుక్‌తో నగర రద్దీలకు అనుకూలం. విశాలమైన సీటు, ఫ్లాట్ ఫ్లోర్ రైడర్ సౌలభ్యాన్ని పెంచుతాయి. బజాజ్ చేతక్ సీ2501 నియో–రెట్రో వైబ్‌తో మెటల్ ఫ్రేమ్ దృఢత్వాన్ని హామీ ఇస్తుంది, ప్రీమియం ఫీల్‌కు బాస్. ఆర్బిటర్ ప్రాక్టికల్ ఉపయోగకరం, చేతక్ స్టైలిష్ గ్రిప్ అందిస్తుంది.
టీవీస్ పైచేయి..
టెక్నికల్ స్పెసిఫికేషన్స్, పనితీరు చూస్తే టీవీఎస్ ఆర్బిటర్ కాస్త పైచేయిగా కనిపిస్తుంది. టీవీఎస్ ఆర్బిటర్‌లో 3.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉండగా, ఇది ఏకంగా 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం నిశ్చింతగా వెళ్లొచ్చు. దీనికి విరుద్ధంగా బజాజ్ చేతక్ సీ2501లో 2.5 kWh బ్యాటరీ మాత్రమే ఉంటుంది, ఇది కేవలం 113 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే ఇస్తుంది.
స్టోరేజ్ – డైమెన్షన్స్
ఆర్బిటర్ 34L భారీ బూట్‌తో షాపింగ్/హెల్మెట్ స్టోరేజ్‌లో గెలుస్తుంది (చేతక్ 25L). గ్రౌండ్ క్లియరెన్స్‌లో చేతక్ (170mm) మెరుగు (ఆర్బిటర్ 165mm), బుంపర్ రోడ్లకు బెటర్. రెండింటిలోనూ 763mm సీట్ హైట్, కానీ చేతక్ 107జుజ తక్కువ వెయిట్‌తో మానవరబుల్. కుటుంబ యూజర్లకు ఆర్బిటర్, సింగిల్ రైడర్లకు చేతక్.
ఫీచర్లు – సేఫ్టీ
ఆర్బిటర్ 5 కలర్ LCD, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ TA అప్డేట్స్, CBS బ్రేక్స్ ఉన్నాయి. చేతక్ బేసిక్ LCD, మ్యూజిక్ కంట్రోల్స్, గడ్–హోమ్ లైట్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (ఆప్షనల్ TecPac). రెండింటిలో ఐపీ67 బ్యాటరీ, 3 ఏళ్ల/50,000 km వారంటీ. ఆర్బిటర్ టెక్–సావీలకు, చేతక్ సింపుల్ ఫోకస్‌కు సరిపోతాయి.
ధరలు ఇలా..
చేతక్ సీ2501 రూ.87,100 నుంచి రూ.91,399 (ఎక్స్–షోరూమ్), ఆర్బిటర్ రూ.99,900 నుంచి రూ.1.05 లక్షలు ఉంది. చేతక్ రూ.12–13జు తక్కువగా మెటల్ బిల్డ్, ఫాస్ట్ ఛార్జ్ ఇస్తుంది. షార్ట్ సిటీ రైడ్స్, స్టైల్ ప్రియులకు బెస్ట్. ఆర్బిటర్ రేంజ్, స్పేస్, ఫీచర్లతో లాంగ్ కమ్యూట్స్, ఫ్యామిలీలకు విజయం. సర్వీస్ నెట్‌వర్క్‌లో రెండు బ్రాండ్లు సమానం.
షార్ట్ డైలీ ట్రిప్స్ (70km), బడ్జెట్ ప్రాధాన్యత ఉంటే చేతక్.. ఎక్కువ రేంజ్, స్టోరేజ్ కావాలంటే ఆర్బిటర్ ఎంపిక చేసుకోండి.