Homeబిజినెస్Best Mileage Scooters: యమహా ఫాసినో నుంచి హీరో డెస్టిని వరకు తక్కువ పెట్రోల్ తాగే...

Best Mileage Scooters: యమహా ఫాసినో నుంచి హీరో డెస్టిని వరకు తక్కువ పెట్రోల్ తాగే స్కూటర్లు ఇవే

Best Mileage Scooters :  కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. మీ బడ్జెట్ లక్ష రూపాయలా.. అయితే లక్ష రూపాయల బడ్జెట్‌లో మంచి మైలేజ్, సేఫ్టీ ఇచ్చే చాలా స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ధర పరిధిలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఏవి ఉన్నాయో తక్కువ పెట్రోల్ తో ఎక్కువ దూరం ప్రయాణించే 5 స్కూటర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

* హోండా యాక్టివా 6G మైలేజ్:
హోండా యాక్టివా 6G కొనుగోలు చేయాలనుకుంటే దీని మైలేజ్ గురించి తెలుసుకోవాలి. బైక్‌దేఖో నివేదిక ప్రకారం, ఈ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 59.5 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. యాక్టివా ధర రూ. 78,684 నుండి రూ. 84,685 వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

* టీవీఎస్ జూపిటర్ 125 మైలేజ్:
హోండా యాక్టివాకు పోటీగా టీవీఎస్ జూపిటర్ 125 మంచి ఎంపిక. బైక్‌దేఖో నివేదిక ప్రకారం, ఈ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 57.27 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 79,540 (ఎక్స్-షోరూమ్).

* సుజుకి యాక్సెస్ 125 మైలేజ్:
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 45 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 82,900 నుండి రూ. 94,500 వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

యామహా ఫాసినో 125 మైలేజ్:
యామహా ఫాసినో 125 స్కూటర్ తక్కువ పెట్రోల్ తో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. బైక్‌దేఖో నివేదిక ప్రకారం, ఈ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 68.75 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 81,180 (ఎక్స్-షోరూమ్).

హీరో డెస్టినీ 125 మైలేజ్:
హీరో డెస్టినీ 125 స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 60 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 80,450 (ఎక్స్-షోరూమ్).

ఈ స్కూటర్లు అన్నీరూ.లక్ష లోపు బడ్జెట్ లో లభిస్తాయి. వీటిలో మీకు నచ్చిన స్కూటర్ ను మీ అవసరాలకు అనుగుణంగా సెలక్ట్ చేసుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular