Lord Shiva: త్రిమూర్తులలో ముక్కోటి మహాశివుడు. ఎందెందు వెతికినా అందులో శివుడు కనిపిస్తాడని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు శివనామ స్మరణ కంటే ప్రతి సోమవారం శివుడిని ఆరాధించడం వల్ల ఆ స్వామి కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే శివ భక్తులు ప్రతి సోమవారం శివ దర్శనం చేసుకొని శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పిస్తూ ఉంటారు. భోళా శంకరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అయితే ఈ అభిషేకం గంగాజలమైతే మహా ఇష్టం. అభిషేకంతో పాటు కొన్ని పూలను శివుడు చాలా ఇష్టపడతారు. వీటిలో ఉమ్మెత్త పువ్వు వంటివి ఉన్నాయి. శివుడికి మహా ఇష్టమైన మరో పుష్పం ఉంది. అదే తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వును శివుడు ఇష్టపడడానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి వివరాల్లోకి వెళితే..
భోళా శంకరుడుగా పేరు ఉన్న.. మహాశివుడుని కోరుకుంటే ఏ వరమైనా ఇస్తాడని భక్తుల నమ్మకం. అలా చాలామంది శివ భక్తులుగా మారిపోయారు అయితే తుమ్మి పువ్వు కూడా శివునికి భక్తురాలు అనే విషయం చాలామందికి తెలియదు. అయితే శివుడి భక్తురాలిగా మారడానికి తుమ్మి పువ్వుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది.
పూర్వకాలంలో ఒక అటవీకుడు అడవిలోకి వెళ్తుండగా అతనికి చలి బాగా వేస్తుంది. అయితే తాను ఆశ్రయం పొందిన చోట ఒక శివలింగం ఉంటుంది. తనకు చలి ఎక్కువగా ఉండటంతో తన వద్ద ఉన్న ఒక సంచిని కప్పుకుంటాడు. ఆ తర్వాత శివలింగాన్ని చూసిన ఆటమికుడు శివుడికి చలి పెడుతుందని గ్రహించి తన వద్ద ఉన్న సంచిని తీసి శివలింగంపై వేస్తాడు. తన భక్తికి మెచ్చిన మహా శివుడు అటవీకుడికి దర్శనం ఇస్తాడు. దీంతో తనకు ఏం వరం కావాలో కోరుకోమని మహాశివుడు అడుగుతాడు. అప్పుడు ఆ ఆటవికుడు తాను ఎప్పుడూ శివుడు పాదాల వద్దనే ఉండాలని కోరుకుంటాడు. దీంతో ఆ శంకరుడు ఆ అటవీకుడికి వరం ఇస్తాడు.
అలా అటవీకుడు పూల రూపంలో మారి శివుడి పాదాలపైనే ఎప్పుడు ఉంటాడు. అయితే అటవీకుడు శివుడుని వరం కోరేటప్పుడు తప్పుగా తన పాదాల వద్ద శివుడుని ఉండమని కోరుతాడు. అయినా అతడిని మన్నించి శివుడు వరం ఇస్తాడు. దీంతో అటవీకుడు పాదాల రూపంలో పూలుగా మారి శివుడి వద్ద సేవిస్తూ ఉంటాడు. శివుడికి పూజ చేసే సమయంలో తుమ్మి పూలను కూడా మర్చిపోవద్దని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ తుమ్మి పూలతో పూజ చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని పేర్కొంటున్నారు. అయితే కొందరు శివ పూజలో బంతిపూలను కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. కానీ వీటిని ఇవ్వడం వల్ల అష్ట కష్టాలను ఎదుర్కొంటారని చెబుతున్నారు. అలాగే మొగిలి పువ్వు కూడా శివుడికి సమర్పించవద్దని కొందరు అంటున్నారు. శివుడికి ఇష్టమైన తుమ్మి పూలను సమర్పించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయని చెబుతున్నారు. ప్రతి సోమవారమే కాకుండా ప్రత్యేక రోజుల్లో కూడా ఈ పూలను సమర్పించి శివుడు అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.