Upcoming Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్ ఏప్రిల్ 2025లో సరికొత్త కార్ల రిలీజ్‌లతో వేడెక్కనుంది. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పెట్రోల్, డీజిల్ కార్ల వరకు వివిధ రకాల మోడళ్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా, నిస్సాన్, MG వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం
మారుతి సుజుకి ఇ-విటారా:
మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఏప్రిల్ 2025లో విడుదల చేయనుంది. ఇది మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV, సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. టాటా కర్వ్ EV, MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE 05 వంటి కార్లతో ఇది పోటీ పడుతుంది. ఈ కారు 500 కి.మీ రేంజ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్:
కియా సంస్థ కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ను ఏప్రిల్ 2025లో విడుదల చేయనుంది. కొత్త డిజైన్, ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్‌తో ఈ కారు విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న కారెన్స్ మోడల్‌ను కూడా కొత్త కారెన్స్‌తో పాటు విక్రయిస్తారు.
టాటా హారియర్ ఈవీ :
టాటా మోటార్స్ హారియర్ ఈవీ ధరలను ఏప్రిల్ 2025లో ప్రకటించే అవకాశం ఉంది. 2025 భారత మొబిలిటీ ఎక్స్‌పోలో.. ఇటీవల జరిగిన టాటా.ఈవీ డేలో ఈ కారును ప్రదర్శించారు. ICE మోడల్ మాదిరిగానే కనిపించే ఈ కారులో కొన్ని EV-ప్రత్యేక డిజైన్ అంశాలు ఉన్నాయి. కొత్త బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, సవరించిన ఎయిర్ డామ్, కొత్త స్కిడ్ ప్లేట్‌ను ఈ కారు కలిగి ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ CNG:
నిస్సాన్ సంస్థ మాగ్నైట్ కాంపాక్ట్ SUV.. CNG వెర్షన్‌ను ఏప్రిల్ 2025లో విడుదల చేయనుంది. ఇది 1.0లీటరును న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది మరియు డీలర్‌షిప్ స్థాయిలో అమర్చబడే CNG కిట్‌ను కలిగి ఉంటుంది. నిస్సాన్ డీలర్ CNG కిట్‌కు ఏడాది వారంటీని అందిస్తుంది. ఈ కారు మైలేజ్ కిలోకు 25 కిమీ వరకు పెరిగే అవకాశం ఉంది.
MG సైబర్‌స్టర్, MG M9 EV:
MG మోటార్ ఇండియా 2-డోర్ల స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు సైబర్‌స్టర్‌ను, అలాగే లగ్జరీ EV M9 MPV ని ఏప్రిల్ 2025లో విడుదల చేయనుంది. ఎంజీ సెలెక్ట్ ప్రీమియం షోరూమ్ ద్వారా విక్రయించబడే సైబర్‌స్టర్ ఇండియాలో చౌకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా రానుంది. దీని ధర దాదాపు రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం 3.2 సెకన్లలో 0నుంచి 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని రేంజ్ 580 కి.మీ ఉంటుంది. MG M9 MPV ‘SELECT’ అవుట్‌లెట్ ద్వారా విక్రయించే రెండవ ఎంజీ మోడల్. దీని రేంజ్ 430 కి.మీ అని చెబుతున్నారు. ఈ కొత్త కార్ల విడుదల భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు.