Homeబిజినెస్Bank Holidays: సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే?

Bank Holidays: సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే?

మనలో చాలామంది తరచూ బ్యాంక్ లావాదేవీలను చేస్తూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. సెలవులపై అవగాహనను కలిగి ఉండటం వల్ల బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పనులను సులభంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. సెప్టెంబర్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ నెల 5వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ […]

Banks Closed In Septemberమనలో చాలామంది తరచూ బ్యాంక్ లావాదేవీలను చేస్తూ ఉంటారు. అయితే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. సెలవులపై అవగాహనను కలిగి ఉండటం వల్ల బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పనులను సులభంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది.

సెప్టెంబర్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ నెల 5వ తేదీన ఆదివారం కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 8వ తేదీన శ్రీమంత శంకరదేవ తిథి కాగా గవాహటిలో ఆరోజు సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన హరితాలిక పండుగ కావడంతో గ్యాంగ్‌టక్‌లో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి పండుగ కావడంతో ఆరోజు కూడా సెలవు దినంగా ఉండనుంది.

సెప్టెంబర్ 11వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు దినంగా ఉండగా సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులు పని చేయవు. సెప్టెంబర్ 17వ తేదీన కర్మ పూజ పండుగ కావడంరో రాంచీలో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 19వ తేదీన ఆదివారం కాగా సెప్టెంబర్ 20వ తేదీన ఇంద్రజాత్ర కావడంతో గ్యాంగ్ టక్ లో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన శ్రీ నారాయణ గురు సమాధి రోజు కావడంతో కొచ్చి, తిరువనంతపురంలో సెలవు దినంగా ఉంది.

సెప్టెంబర్ 25వ తేదీన నాలుగో శనివారం సెలవు దినం కాగా సెప్టెంబర్ 26వ తేదీన చివరి ఆదివారం సెలవు దినంగా ఉండనుంది. బ్యాంక్ సెలవు దినాల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ లావాదేవీలపై అవగాహన ఉన్నవాళ్లు లావాదేవీలు జరపవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper