
NTR Rajamouli: సీనియర్ ఎన్టీఆర్ నట వారుసుడిగా టాలీవుడ్ తెరపైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్(NTR) తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్ లో అగ్రహీరోగా ఎదిగాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అంతేకాదు.. బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోను నిర్వహిస్తున్నాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఎన్టీఆర్ ఎలాంటి మోహమాటం లేకుండా బయటపెట్టాడు.
మంగళవారం ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ఎపిసోడ్లో మనీష్ అనే కంటెస్టెంట్ తో ఎన్టీఆర్ సంచలన నిజాలు పంచుకున్నారు. అతడికి నటించాలనే కోరిక ఉందనే విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతోందని.. మొదట్లో నేను చాలా లావుగా ఉండేవాడినని.. కానీ నాకు ఎప్పుడూ లావుగా ఉన్నానని అనిపించలేదన్నారు. కానీ ఒక రోజు దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ‘నన్ను లావుగా ఉన్నావని’ హెచ్చరించాడు. యమదొంగ సినిమా కోసం తీసుకున్నప్పుడు ‘‘లావుగా ఉన్నావని.. అసహ్యంగా ఉన్నావని రాజమౌళి తనను మందలించాడని ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘రాఖీ’ సినిమా తర్వాత తాను విపరీతంగా లావు పెరగడంతో రాజమౌళి చూసి ‘చాలా అసహ్యంగా ఉన్నావు..నీ జుట్టు ప్రాబ్లెం.. నీ కొవ్వు ప్రాబ్లెం’ అని హెచ్చరించాడని.. అప్పటి నుంచి నేను బరువు, లావు తగ్గించుకున్నానని.. మన చుట్టు ఉండే ఫ్రెండ్స్ మాత్రమే మనల్ని గైడ్ చేస్తారని.. ఆరోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి మూవీ ‘యమదొంగ’ సినిమా కోసం లావుతగ్గిన ఎన్టీఆర్ ఆ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీతో అలానే మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం కండలు తిరిగిన దేహంతో అలరిస్తున్నాడు.