Bank Holidays : ప్రస్తుత కాలంలో బ్యాంకుతో వ్యవహారాలు జరిపే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రత్యక్షంగా బ్యాంకుకు వెళ్లి నగదు బదిలీలు చేయకపోయినా.. ఆన్ లైన్ లో బ్యాంకుతో లింక్ అయిన యాప్ ల ద్వారా నగదు వ్యవహారాలు జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకు అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సార్లు బ్యాంకు ఓపెన్ చేసి ఉండడం వల్లే నగదు వ్యవహారాలు ఈజీ అవుతూ ఉంటాటాయి. దీంతో బ్యాంకు ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు హాలీడేస్ లో ఉంటుంది? అని తెలుసుకునేందకు ఇష్టపడుతారు. ఒక బ్యాంకుకు ఎన్ని సెలవులు ఉంటాయి? ఎన్ని రోజులు పనిచేస్తాయి? అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ ప్రారంభం అయిన తరువాత బ్యాంకులకు కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటాయి. అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బ్యాంకులకు సెలవులు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని జాతీయ సెలవులు ఉండగా.. మరికొన్ని ఆయా ప్రాంతాలను బట్టి నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ తదితర పండుగలకు ప్రత్యేక సెలవులు ఉంటాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఈ సెలవు ఉండదు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని కొన్ని సెలవులు తెలుగు రాష్ట్రాలకు వర్తించవు. అయితే అక్టోబర్ లో వరుసగా పండుగలు, శని, ఆదివారాలు వస్తున్నందున చాలా వరకు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నిఉన్నాయో తెలుసుకుందాం..
అక్టోబర్ లో దేశ వ్యాప్తంగా చూస్తే బ్యాంకులకు 15 రోజులు సెలవులు వర్తిస్తాయి. వీటిలో అక్టోబర్ 1న జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నందున ఈరోజున సెలవు ప్రకటించారు. ఆ తరువాత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెలవు ఇచ్చారు. అక్టోబర్ 3న దేవీ నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు రాజస్థాన్ లోని జైపూర్ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీంతో ఇక్కడ సెలవు ఇచ్చారు. అక్టోబర్ 5న ఆదివారం కానుంది. ఈరోజు ఎలాగూ దేశ వ్యాప్తంగా సెలవు ఉంటుంది.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 10న కోల్ కతా లో దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కలకత్తాలో బ్యాంకులకు సెలవు ఇవ్వనున్నారు. బెంగళూరు, చెన్నై, కలకత్తా, షిల్లాంగ్, గౌహతిలో దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధ పూజను అక్టోబర్ 11న నిర్వహించనున్నారు. ఈ నేపథయంలో ఈరోజు ఆ ప్రాంతాల్లో సెలవు ఉండనుంది. అక్టోబర్ 12న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈరోజు బ్యాంకులకు సెలవు ఉండనుంది.
అక్టోబర్ 13న ఆదివారం కాగా.. 14న సోమవారం గాంగ్టక్ లో దుర్గాపూజ నిర్వహిస్తారు. దీంతో ఇక్కడ బ్యాంకుకు సెలవు ఇస్తారు. అక్టోబర్ 16న లక్ష్మీపూజను త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో నిర్వహిస్తారు. ఈప్రాంతంలో సెలవు ఉండనుంది. అక్టోబర్ 17న వాల్మీకి జయంతి సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవును ప్రకటించారు. అక్టోబర్ 20న ఆదివారం కానుంది. 26న రెండో శనివారం 27న ఆదివారం ఉండనుంది. అక్టోబర్ 31న దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ఈరోజు లక్ష్మీపూజలతో పాటు నోములు ఉంటాయి. దీంతో ఈరోజు సెలవు ఉండనుంది. ఇలా మొత్తం బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉండనున్నాయి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: 15 days holidays for banks in october details of dates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com