https://oktelugu.com/

Automatic Cars: టాప్ ఆటోమేటిక్ కార్లు ఇవే.. ధర చాలా చీప్..

ఇటీవల ఆటోమేటిక్ కార్ల వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే ఏఎంటీ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇవి కూడా లో బడ్జెట్ లో వచ్చాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకుందామా..

Written By: , Updated On : April 20, 2024 / 09:37 AM IST
Cheapest-Automatic-Cars
Follow us on

Automatic Cars:  కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎలాంటి మోడల్ కొనుగోలు చేయాలి? అందులో ఏముండాలి? అనే విషయంలో వినియోగదారులకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కొందరు కారులో డిజైన్ చూస్తారు..మరికొందరు మైలేజ్ చూస్తారు.. ఇంకొందరు ఆటోమేటిక్ ఫీచర్స్ కలిగిన కార్లు కావాలని కోరుకుంటారు. ఇటీవల ఆటోమేటిక్ కార్ల వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే ఏఎంటీ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇవి కూడా లో బడ్జెట్ లో వచ్చాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకుందామా..

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ ఎన్నో ఆకర్షించే మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారుల కోరిక మేరకు ఆటోమేటిక్ కార్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా ఎక్సెటర్ బెస్ట్ ఏఎంటీగా నిలిచింది. ఇందులో ఆటోమేటిక్ ఫీచర్లు అలరిస్తాయి. ఇందులో విశేషమేంటంటే వాయిస్ ద్వారా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తెరుచుకుంటుంది. దీనిని రూ.6.13 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ లో రూ.10.28 లక్షలు ఉంది.

రెనాల్ట్ కార్లు ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిలో కిగర్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇందులో మల్టీ సైన్స్ డ్రైవ్ మోడ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ఎక్కువగా ఆదరణ పొందుతుంది. దీనిని రూ. 6 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు విక్రయిస్తున్నారు. నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ కార్ల జాబితాలో ఉంది. ఇందులో వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరీఫైయర్ ఉన్నాయి. వీటితో పాటు హై ఎండ్ స్పీకర్లు అలరిస్తాయి. దీనిని రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

మారుతి కార్ల గురించి తెలియని వారుండరు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫ్రంట్ లో స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ తో కారు గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మోడల్ ను రూ.7.52 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాటా కంపెనీకి చెందిన పంచ్ కూడా ఆటోమేటిక్ కారుగా నిలిచింది. ఇందులో డైమంట్ కట్ అల్లాయ్ వీల్స్, డీ కట్ స్టీరింగ్ అలరిస్తుంది. దీనిని రూ.6.12 లక్షల తో విక్రయిస్తున్నారు.