Apple iPhone SE 4 : ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరికి క్రేజే. వినియోగదారుల కోరికల నిమిత్తం ఆపిల్ కంపెనీ ఎప్పటి కప్పుడు కొత్త వెర్షన్ లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈరోజు కూడా ఆపిల్ ఐఫోన్ SE 4 ను లాంచ్ చేయనుంది. ఇది ఫేస్ ఐడి, 6.1-అంగుళాల OLED డిస్ప్లే, A18 చిప్, 48MP కెమెరాతో సహా పలు అప్ డేట్లతో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేయబడింది. కొత్త డిజైన్ ఐఫోన్ 14ను పోలి ఉంటుంది. హోమ్ బటన్‌ను రిమూవ్ చేసింది. ఎక్కువ స్టోరేజీ, RAM, పెద్ద బ్యాటరీ, USB-C ఛార్జింగ్ పోర్ట్ మంచి పనితీరును ఫోన్ కు అందజేస్తాయి. దీని ధర $499(రూ.43,000) నుండి ప్రారంభమవుతుంది.
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ ఇదివరకటి వాటి కంటే అతిపెద్ద మేకోవర్‌ను పొందబోతోంది. ఈరోజు లాంచ్ కానున్న ఐఫోన్ SE 4, ఆపిల్ చివరకు 18 సంవత్సరాల తర్వాత దాని ఐకానిక్ హోమ్ బటన్ డిజైన్‌ను రిమూవ్ చేయడంతో ఒక శకానికి ముగింపు పలికట్లు అవుతుంది. కానీ ఇది కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్ కాదు. AI ఫీచర్‌లను ఎనేబుల్ చేసే విధంగా ఓ సంచలన విజయం అనే చెప్పుకోవాలి. ఐదేళ్ల పాత ఐఫోన్ SE 3తో పోలిస్తే ఐఫోన్ SE 4 నుండి కస్టమర్లు కోరుకునే 10 అప్‌గ్రేడ్‌ల గురించి తెలుసుకుందాం.
1. కొత్త డిజైన్
SE 4 ఐఫోన్ 14 అల్యూమినియం, గ్లాస్ తో డిజైన్ చేశారు. పాత ఐఫోన్ 8 లుక్ నుండి పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. కొత్త మోడల్ ఫ్లాట్ అంచులు, పెద్ద ఫుట్ ఫ్రింట్, మరింత ప్రీమియం అనుభూతిని యూజర్లకు అందిస్తుంది. అదే సమయంలో సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో రాబోతుంది.
2. టచ్ IDకి వీడ్కోలు
18 సంవత్సరాల తర్వాత, ఆపిల్ ఐఫోన్‌లలో హోమ్ బటన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతున్నారు. SE 4 ఫేస్ ఐడీకి మారుతుంది. ఇది డిస్ప్లే నాచ్‌లో ఉంటుంది. ఇది ఐఫోన్‌లలో టచ్ IDకి ఎండ్ కార్డును సూచిస్తుంది.
3. యాక్షన్ బటన్ అప్‌గ్రేడ్
iPhone SE 4లో మ్యూట్ స్విచ్‌ను Action బటన్‌గా మారుస్తారు, ఇది iPhone 15 Proలో మొదటిసారి కనిపించింది. ఈ బటన్‌ను మీ అవసరాలను అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
4. పెద్ద డిస్‌ప్లే
4.7-అంగుళాల LCD స్క్రీన్ మందపాటి బెజెల్స్‌తో కూడిన ఆధునిక 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ప్రధాన మార్పు. ఇది SEని Apple ప్రస్తుత డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా తీసుకువస్తుంది. మెరుగైన కాంట్రాస్ట్, కలర్ రీ ప్రొడక్షన్ అందిస్తుంది.
5. iPhone 16 చిప్
iPhone 16 నుండి వచ్చిన A18 చిప్ A15 బయోనిక్ స్థానంలో SE 4కి పవర్ అందిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ ఫోన్ పనితీరు మెరుగుపరచడమే కాకుండా Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా అనుమతిస్తుంది.
6. RAM, స్టోరేజీ
బేస్ స్టోరేజ్ 128GBకి రెట్టింపు అవుతుందని అంచనా. RAM 8GBకి (4GB నుండి) పెరుగుతుంది. ఇది స్మూత్ మల్టీ టాస్కింగ్, రాబోయే ఫీచర్‌లు, అప్‌డేట్‌ల కోసం ఫోన్ ను భవిష్యత్తు-ప్రూఫింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
7. అప్‌గ్రేడ్ కెమెరా
వెనుక కెమెరాను కొనసాగిస్తూనే SE 4 12MP నుండి 48MPకి అప్‌గ్రేడ్ కావచ్చు, ఇది ఇటీవలి ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ల ప్రధాన సెన్సార్ నాణ్యతకు సరిపోతుంది. ఇది క్రాపింగ్ ద్వారా 2x ఆప్టికల్-నాణ్యత జూమ్, తక్కువ కాంతిలోనూ క్వాలిటీ ఫోటోలను, వీడియోలను తీసుకోవచ్చు.
8.పెద్ద బ్యాటరీ
పాత మోడల్ 2,018mAh బ్యాటరీ సామర్థ్యంతో పోలిస్తే కొత్త మోడల్ లో 3,279mAh బ్యాటరీతో వస్తుందని తెలుస్తుంది. A18 చిప్‌తో కలిపి ఇది ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
9. USB-C, MagSafe
Apple చివరకు Lightning పోర్టును తొలగించి, iPhone SE 4లో USB-C చార్జింగ్ ఆధారంగా సర్వసాధారణ ఛార్జింగ్ మరియు MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకువస్తుంది.
10 . అధిక ధర ట్యాగ్
iPhone SE 3 439డాలర్ల(రూ.38,000) ధరతో పోలిస్తే, iPhone SE 4 499డాలర్ల(రూ.43,000)కి స్వల్ప ధర పెరుగుదలతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.