Pawan Kalyan : ఏపీ( Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను దర్శించనున్నారు. మూడు రోజులపాటు కేరళ తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు. అందులో భాగంగా ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కేరళ బయలుదేరారు. కొద్దిసేపటి కిందే కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈనెల 14 వరకు పవన్ ఆలయాల సందర్శన జరగనుంది. ముందుగా కేరళ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు. అనంతరం తమిళనాడులోని ఆలయాలను సందర్శిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ఆలయాల సందర్శన జరుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే దీని వెనుక బిజెపి వ్యూహం ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
* మూడు రోజులపాటు ఆ రెండు రాష్ట్రాల్లో తమిళనాడుతో( Tamil Nadu ) పాటు కేరళలో ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తారు పవన్. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరమ రామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.. తదితర ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. కొద్ది రోజుల కిందట తిరుమలలో వివాదం నేపథ్యంలో.. సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్ట వ్యవస్థ అవసరం అని పవన్ చెప్పుకొచ్చారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పుడు అదే అజెండాతో ఆలయాల సందర్శనకు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది.
* బిజెపి వ్యూహం అది
అయితే పవన్ పర్యటన వెనుక బిజెపి( Bhartiya Janata Party) వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలపడాలని భావిస్తోంది. ఎందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు పవన్ ద్వారా హిందుత్వ అజెండాను పంపి.. దానితోనే బలపడాలని బిజెపి భావిస్తోంది. ముఖ్యంగా తమిళనాడుతో పాటు కేరళలో బిజెపి కనీసం ఉనికి చాటుకోలేకపోతోంది. ఇప్పుడు పవన్ ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లారు. ఆలయాల సందర్శన సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ పై ప్రత్యేక ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉంది.
* కొద్ది రోజుల కిందట ఆధ్యాత్మిక సభ
బిజెపి హిందుత్వవాదం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి. పవన్( Pawan Kalyan) సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్ట వ్యవస్థ రావాలని కోరారు. అటు తర్వాత ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఆధ్యాత్మిక సమావేశం జరిగింది. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు తరలివచ్చారు. పవన్ డిమాండ్ చేసిన మాదిరిగానే సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు. దీంతో బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ఉన్నట్టు అర్థమయింది. ఇప్పుడు కూడా పవన్ ఆలయాల సందర్శన వెనుక బిజెపి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.