Apple iPhone at cheapest price: మనలో చాలామందికి ఆపిల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. పైగా ఆపిల్ ఫోన్ వాడటాన్ని స్టేటస్ సింబల్ లాగా భావిస్తుంటారు. ఆపిల్ ఫోన్ లో ప్రతి ఏడాదికి ఒకసారి కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి. ప్రతి మోడల్ లోనూ ఆపిల్ కంపెనీ సరికొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతూ ఉంటుంది. కొత్త మోడల్ వచ్చినట్టు మాత్రాన ఆపిల్ లో, పాత మోడల్ కు డిమాండ్ తగ్గదు. డిమాండ్ తగ్గదు కాబట్టి రేటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ తక్కువ ధరకే ఆపిల్ ఫోన్ వస్తే.. చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఇప్పుడు అటువంటి ఆఫర్ ను రిలయన్స్ డిజిటల్ అందిస్తోంది.
ఐఫోన్ 14 ప్రారంభ ధర ప్రస్తుతం 48,403 రూపాయలుగా ప్రకటించింది రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో మూడు వేల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. దీనివల్ల ఐఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం 45,403 రూపాయలుగా ఉండనుంది. ఐఫోన్ 14 తొలిసారిగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ధర 79,900 ఉండేది. ప్రస్తుతం ఆఫర్ ద్వారా ఏకంగా 34 వేల 497 రూపాయల వరకు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. వాస్తవానికి ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ ధర ఈ స్థాయిలో తగ్గడం నిజంగా ఆశ్చర్యకరమే.
ఐఫోన్ 14 ఎంత శక్తివంతమైన ఏ 15 బయోనిక్ చిప్ సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ మొబైల్. ఇది గేమింగ్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇది ఫోన్ ఉపయోగించేవారికి అద్భుతమైన అనుభూతి అందిస్తుంది. భద్రత కోసం ఫేస్ ఐడి అందుబాటులో ఉంటుంది. అత్యవసరమైన సమయాలలో ప్రాణాలను రక్షించడానికి క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉంది.
ఫోన్ కు 12 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. తక్కువ వెలుతురులో కూడా ఇవి అద్భుతమైన ఫోటోలను తీస్తాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ ట్రూ డెప్ కెమెరా ఉంది. వైర్, వైర్లెస్ చార్జింగ్ తో పాటు, మేగ్ సేఫ్ చార్జింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది వాటర్, డస్ట్ రిసిస్టెన్సీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వచ్చే ఐ ఓ ఎస్ అప్డేట్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ప్రీమియం అనుభవం తక్కువ ధరలో కావాలంటే ఈ ఫోన్ కొనుగోలు ఒక అద్భుతమైన అవకాశం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.