Dhandoraa Movie 1st Day Collections: గత వారం రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ‘దండోరా'(Dhandoraa Movie) మూవీ పేరు మనకి వినిపిస్తూనే ఉంది. మూవీ టీం ప్రొమోషన్స్ చాలా బలంగా చేయడం మాత్రమే కాకుండా, మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక లో శివాజీ హీరోయిన్స్ వేసుకునే బట్టలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పెను దుమారమే రేపింది. ఎక్కడ చూసిన ఇప్పుడు దీని గురించే చర్చ. టాప్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా శివాజీ(Actor Sivaji) చేసిన కామెంట్స్ కి స్పందిస్తూ ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో మూవీ కి కూడా ఫ్రీ పబ్లిసిటీ జరిగింది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు చాలా బాగుందని, ‘కోర్టు’ తర్వాత శివాజీ మరోసారి అద్భుతమైన నటన కనబర్చి, ఈ సినిమాని పైకి లేపాడని, ఇలా విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం. కానీ ఈ పాజిటివ్ రివ్యూస్ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు.
ఒకే రోజున నాలుగైదు సినిమాలు విడుదల అవ్వడం తో ‘దండోరా’ చిత్రానికి షోస్ దొరకలేదు. వైజాగ్ లాంటి ప్రాంతం లో పట్టుమని పది షోస్ కూడా లేవంటే, ఇక ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఫలితంగా బుక్ మై షో యాప్ లో కనీసం ట్రెండింగ్ లోకి కూడా రాలేదు. నిన్న విడుదలైన సినిమాలన్నిట్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రమిదే. కానీ కలెక్షన్స్ మాత్రం లేవు. సినిమా కి బోలెడంత పబ్లిసిటీ జరిగింది, శివాజీ పేరు గత రెండు మూడు రోజులుగా ఒక రేంజ్ మారుమోగిపోతోంది, అయినప్పటికీ కలెక్షన్స్ లేవు. ప్రస్తుతం ఉన్న షోస్ తక్కువే అయినప్పటికీ, వాటికి హౌస్ ఫుల్స్ పడితే, ఆడియన్స్ డిమాండ్ ని బట్టీ చిన్నగా షోస్ ని పెంచుకుంటూ పోవచ్చు.
ఎందుకంటే క్రిస్మస్ కి విడుదలైన ఏ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రాలేదు కాబట్టి, ఈ చిత్రానికి జనాలు కదులుతున్నారు కాబట్టి, షోస్ థియేటర్స్ వాళ్ళే పెంచుతారు. కానీ ఈ సినిమాకు అది జరగడం లేదు. బహుశా ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ కి వెళ్లేంత శ్రమ అవసరం లేదని, ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చని ఫిక్స్ అయ్యినట్టు ఉన్నారు. అందుకే కలెక్షన్స్ రావడం లేదు . ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. రెండవ రోజు ఇందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. సినిమాలో విషయం లేక ఫ్లాప్ అయితే పర్వాలేదు అనుకోవచ్చు, మంచి కంటెంట్ ఉండి కూడా ఫ్లాప్ అయ్యిందంటే, శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు ఈ చిత్రం పై నెగిటివ్ గా పనిచేశాయా? అనే కోణం లో కూడా నెటిజెన్స్ ఆలోచిస్తున్నారు.