కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కరోనా కల్లోలంతో అస్తవ్యస్తమైన దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టే పనిచేశారు. ఆత్మనిర్భర్ భారత్ కు పెద్దపీట వేశారు. ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. మిషన్ పోషణ్3.0ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం చెందేలా నిర్మల కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాలకు సమన్యాయం చేశారు. వ్యవసాయ రంగానికి ఏకంగా 16.50 లక్షల కోట్లు కేటాయించారు. కరోనాతో కుదేలైన ఆరోగ్య రంగానికి ఊపిరిపోశారు.
*పెరిగేవి ఇవే..
ఈ బడ్జెట్ తో కొన్నింటిపై పన్నులు వేసి ధరలు పెరిగేలా చేశారు. బడ్జెట్ తో ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. దిగుమతి చేసుకున్న క్లాత్స్, వంట నూనే, ఆటో పార్ట్స్ ధరలు పెరిగాయి. రత్నాల ధరలు పెరిగాయి. కార్ల విడిభాగాల ధరలు, వెండి ధరలు, బంగారం, నైలాన్ దుస్తుల ధరలు పెరుగనున్నాయి. సోలార్ ఇన్వర్టర్ల పై పన్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మరింత పెరుగనున్నాయి. లెథర్ షూ ధర కూడా పెరుగుతుంది. కాబులీ చానా, పప్పులు, యూరియా, ఆటో స్పెర్ పార్ట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.
*బడ్జెట్ తో తగ్గేవి ఇవే..
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నట్టే దేశగృహ నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో ఐరన్, స్టీల్ ధర తగ్గాయి.నైలాన్ క్లాత్స్ ధరలు తగ్గనున్నాయి. కాపర్ వస్తువుల ధరలు కూడా దిగొచ్చాయి. ఇన్సురెన్స్ చేసుకునేవారికి కూడా బెనిఫిట్స్ కలిగించారు. షూ ధరలు కూడా తగ్గాయి. అయితే మామాలు షూ ధర మాత్రం తగ్గుతాయి. వెండి, బంగారం ధరలు తగ్గాయి. డ్రై క్లీనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా దిగొచ్చాయి.
*బడ్జెట్ లో కేటాయింపులు ఇవీ..
ఆత్మ నిర్భర్ ఆరోగ్య భారత్ కి 2.23 లక్షల కోట్లు, కరోనా వాక్సిన్ కి 35 వేల కోట్లు, రైల్వే శాఖ లక్ష 10వేల కోట్లు, జల్ జీవన్ మిషన్ 2.87 లక్షల కోట్లు, విద్యుత్ 3.5 లక్షల కోట్లు , స్వచ్చ్ భారత్ 2.0కి లక్ష 41 వేల కోట్లు , గ్రామీణ మౌలిక సదుపాయాలకి 40 వేల కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 3 వేల కోట్లు,వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు, సౌర శక్తి రంగానికి 1000 కోట్లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15,700 కోట్లు, రక్షణ మంచినీటి పథకాలు 87 వేల కోట్లు, వ్యవసాయ రుణాలకి 16.5 లక్షల కోట్లు, దేశ ఆరోగ్యరంగానికి 2 లక్షల కోట్లు
నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కేరళలలో 1100 కి.మీల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. బెంగాల్ లో రూ.25వేల కోట్లతో హైవేలను అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. కేరళలో రూ.65 వేల కోట్లు.. బెంగాల్ లో రూ.95వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు.
చెన్నై మెట్రోకు రూ.63246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14788 కోట్లు కేటాయించింది. కేరళలోని కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం చేస్తామని ప్రకటించింది. తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోకు రూపాయి విదిల్చలేదు.
20 ఏళ్లు వాడిన వాహనాలు ఇక రోడ్డు ఎక్కకుండా నిబంధనలు మార్చారు. వాటిని తుక్కుకు అమ్ముకోవాల్సిందే. వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20ఏళ్లు.. వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. వాయు కాలుష్య నివారణకు రూ.2217 కోట్లు కేటాయించారు. కరోనాకు ముందు నుంచే గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఆటోరంగంలో జోష్ నింపడానికే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది.
*ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ
పలు సంస్థల్లో భారీ స్థాయిలో పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, సీసీఐ, హెచ్పీసీఎల్, ఐడీబీఐ, బీఈఎంఎల్ సంస్థల ప్రైవేటీకరణపై ప్రకటన చేశారు.మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. బీమా రంగంలో 75 శాతం వరకు ఎఫ్డీఐలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
*వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది. అందులోనూ.. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి రూ.35 వేల కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల కోట్లతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించడానికి వెనుకాడబోమని తెలిపారు.
*ఐటీ చెల్లింపుదారులకు షాక్
ఐటీ పన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రం కేంద్రం ఊరట కల్పించింది. 75 ఏళ్లు దాటిన సిటీజన్లకు ఐటీ రిటర్న్ దాఖలకు కేంద్రం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీ తో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది.
* దేశమంతా ఒకే దేశం-ఒకేరేషన్ కార్డు’
ఒకే దేశం-ఒకేరేషన్ కార్డు’ విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని నిర్మల ప్రకటించారు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఉన్నా.. వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చని నిర్మల పేర్కొన్నారు. ఈ పథకంతో ముఖ్యంగా వలస కార్మికులు లాభపడుతారని పేర్కొన్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Budget 2021 here s the list of things that will become costlier and cheaper
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com