Ghajini: కొన్ని సినిమాలు కొన్ని భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తాయి. ఇక వాళ్ళు ఎంచుకున్న నేపథ్యంగానీ, ఆ సినిమాలో హీరో, హీరోయిన్లను చూపించిన పద్ధతి గాని ప్రేక్షకులందరికీ బాగా నచ్చి, ఆ కథకి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే సినిమాలు ఈజీగా సక్సెస్ లు సాధిస్తాయి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ లాంటి దర్శకుడు కూడా మొదటి నుంచి చాలా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన సూర్య ని పెట్టి తీసిన ‘గజిని’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమా తమిళ్, తెలుగు రెండు భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ అమీర్ ఖాన్ తో ఈ సినిమాను తెరకెక్కించి భారీ సక్సెస్ సాధించడమే కాకుండా మొదటి సారి వందకోట్లను సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మొదట అమీర్ ఖాన్ తో కాకుండా వేరే హీరోతో చేయాలని మురుగదాస్ అనుకున్నాడట.
ఇక ఇంతకీ ఆ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్… అయితే గజిని సినిమాలో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకి సంభందించిన కొన్ని విషయాలను తెలియజేశాడు. అయితే మురుగదాస్ గజిని సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తో చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని ప్రదీప్ రావత్ కి తెలియజేశారట. ఇక అప్పుడు ప్రదీప్ రావత్ ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ అయితే బాగా సెట్ అవుతాడు.ఆయన అయితే సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. మళ్ళీ అమీర్ ఖాన్ ఎవ్వరిని ఏం అనడు.
అదే సల్మాన్ ఖాన్ అయితే చాలా అరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అమీర్ తో చేయడమే బెస్ట్ అని చెప్పడంతో మురుగదాస్ అమీర్ ఖాన్ కి కథ చెప్పి ఒప్పించి ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తో మరోసారి భారీ సక్సెస్ ను కొట్టి ఫామ్ లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…