Prabhas: ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం సర్జరీ చేయించుకుంటున్నారా..?

విపరీతమైన బాడీ పెంచి దాన్ని చూసి ఆ తర్వాత మెంటెన్ చేయలేకపోవడం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఇప్పటికే చాలామంది ప్రభాస్ ని విమర్శిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి.

Written By: Gopi, Updated On : May 20, 2024 9:35 am

Prabhas

Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్..ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధిస్తూ వచ్చాయి. అలాగే ఆయన నటించిన బాహుబలి సినిమాతో ఇండియాలో స్టార్ హీరోగా పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే బాహుబలి సినిమాలో ఆయన బాడీని చాలా ఫిట్ గా మార్చుకోవడంలో ఆయన తీసుకున్న కేరింగ్ ఆ తర్వాత తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

ఇక దానివల్లే ఆయన బాడీ మొత్తం శెపౌట్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ఒకప్పుడు ప్రభాస్ అంటే చాలా ఫిట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చాలా నర్వస్ గా కనిపిస్తున్నాడు. ఇక స్పిరిట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికోసం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి సర్జరీ చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సర్జరీ ద్వారా తను మళ్ళీ యంగ్ లుక్ లోకి మారిపోగలడా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఆయన అలా మారడానికి ముఖ్య కారణం అయితే బాహుబలి సినిమా అనే చెప్పాలి.

అందులో విపరీతమైన బాడీ పెంచి దాన్ని చూసి ఆ తర్వాత మెంటెన్ చేయలేకపోవడం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఇప్పటికే చాలామంది ప్రభాస్ ని విమర్శిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం ఈ సినిమాలో సందీప్ ఎలా చెప్తే అలా చేయడానికి ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడట.

ఇక అందులో భాగంగానే ప్రభాస్ లుక్స్ చాలా యంగ్ గా కనిపించాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ కి కొన్ని సర్జరీలైతే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏం సర్జరీ చేయిస్తున్నారు అనేది క్లారిటీగా తెలియనప్పటికీ మొత్తానికైతే ఆయనని యంగ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది…