South Indian directors in Bollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళ కంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళందరూ ప్రస్తుతం బాలీవుడ్ బాట పడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించే దర్శకులు కరువయ్యారు. దాంతో మన దర్శకుల వైపు వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు బాలీవుడ్ బాట పట్టారు. ఇక గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడు సన్నీ డియోల్ తో కలిసి ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. సందీప్ రెడ్డి వంగ సైతం రణ్బీర్ కపూర్ తో ఆనిమల్, షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ లాంటి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అట్లీ ఎంట్రీ ఇచ్చి జవాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమా షారుక్ ఖాన్ కి భారీ గుర్తింపు తీసుకురావడమే కాకుండా షారుఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది… మరికొంతమంది స్టార్ట్ డైరెక్టర్లు సైతం బాలీవుడ్ బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు… ఇండియన్ సినిమా మొత్తం ఒకటైపోయింది. కాబట్టి ఏ భాషలో ఉన్న దర్శకులైన ఇతర భాషల్లోని హీరోలతో సినిమాలను చేసి పాన్ ఇండియా రిలీజ్ లను చేస్తున్నారు. దాంతో సినిమాకు భారీ హైప్ రావడమే కాకుండా సినిమా బాగుంటే సూపర్ సక్సెస్ గా నిలుస్తోంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం సినిమా డిజాస్టర్ గా మారుతోంది.
Also Read: శ్రీకాంత్ ఓదెల ను లైట్ తీసుకున్న చిరంజీవి..?
ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు ఎవరు పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో ఆ హీరోలందరు సౌత్ దర్శకుల మీద పడుతుండడం విశేషం… ఇక ఇప్పుడు హరీష్ శంకర్ లాంటి దర్శకుడు సైతం సల్మాన్ ఖాన్ తో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాని చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. హరీష్ శంకర్ బాలీవుడ్ వెళ్లి తన స్టైల్ లో కమర్షియల్ సినిమా చేస్తే మాత్రం అతనికి మంచి గుర్తింపు లభిస్తుందని కొంతమంది భావిస్తుంటే,
Also Read: కింగ్డమ్ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..విజయ్ దేవరకొండ కి మరో దెబ్బ!
మరి కొంతమంది మాత్రం ఆయన సినిమాలు పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండవని సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడం వల్ల ఇద్దరికీ మైనస్ అవుతుందని మరి కొంతమంది చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా సౌత్ దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా లో టాప్ పొజిషన్ కి వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…