అలుపెరగని పోరాట యోధుడు ‘జగన్’

తండ్రి లేని పిల్లగాడు.. నాడు దేశాన్ని ఏలుతున్న సోనియా గాంధీనే ఎదురించాడు.. 16 నెలలు జైలుకెళ్లాడు. అయినా ఆ చెక్కుచెదరని సంకల్పం.. మనో ధైర్యం అతడిని మొండిగా ముందుకెళ్లేలా చేసింది. ప్రత్యర్థులు ఎంత బలవంతులు అయినా 2014లో కూటమి గట్టినా మొండిగా ఎదుర్కొన్నాడు. ఓడిపోయినా ఐదేళ్లు పార్టీని కాపాడాడు. పాదయాత్రతో ప్రజల మనసు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ అలుపెరుగని ‘బాట’సారి చివరకు విజయతీరాలకు చేరాడు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా’ […]

Written By: NARESH, Updated On : December 21, 2020 12:35 pm
Follow us on

తండ్రి లేని పిల్లగాడు.. నాడు దేశాన్ని ఏలుతున్న సోనియా గాంధీనే ఎదురించాడు.. 16 నెలలు జైలుకెళ్లాడు. అయినా ఆ చెక్కుచెదరని సంకల్పం.. మనో ధైర్యం అతడిని మొండిగా ముందుకెళ్లేలా చేసింది. ప్రత్యర్థులు ఎంత బలవంతులు అయినా 2014లో కూటమి గట్టినా మొండిగా ఎదుర్కొన్నాడు. ఓడిపోయినా ఐదేళ్లు పార్టీని కాపాడాడు. పాదయాత్రతో ప్రజల మనసు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ అలుపెరుగని ‘బాట’సారి చివరకు విజయతీరాలకు చేరాడు.

‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా’ అనే మాట కోసం వైఎస్ జగన్ శ్వాసించాడు, స్వప్నించాడు. పరితపించాడు. అదే లక్ష్యమై ముందుకు సాగాడు. దీక్షలా, యజ్ఞనంలా సాగిపోతే ఎంతటి లక్ష్యమైన ఒడి చేరుతుందని నిరుపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

2019 మే 30న జగన్ పట్టుదలకు పట్టాభిషేకం జరిగింది. కానీ గతమెంతో దుర్లభంగా సాగింది. నా అనేవాళ్లు.. నా అనే వ్యవస్థలు అని అతడిని వెలివేశాయి. చిన్నగా అతడే వ్యవస్థను నిర్మించుకోవడం మొదలు పెట్టాడు. అతడే నాయకులను తయారు చేయడం మొదలు పెట్టాడు. అటుపోట్లకు ఎదురు దెబ్బలకు ఎదురు నిలబడ్డాడు. చివరకు విజయం సాధించాడు. అతడిని వెలివేసిన మనుషులు, వ్యవస్థలు  కీర్తిస్తున్నాయి. అతడి కరచాలనం కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు విజయం అంటే ఇది మనల్ని చిన్న చూపు చూసిన వాళ్లు  మన వద్దకు పరుగులు పెట్టడం అసలైన విజయం అని జగన్ నిరుపించాడు.  జగన్ అది సాధించాడు.

ఉద్యమాలే ఊపిరిగా.. జనమే తన హృదయ స్పందనగా.. జనం మెచ్చిన జననేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారు.. ఈ క్రమంలో ఎన్నో చీకటి రాత్రులు గడిపారు. జైలుకు వెళ్లారు. అవమానాలు కత్తిపోట్లు.. వెన్నుపోట్లు అయినా చెక్కుచెదరని ఆయన సంకల్పం చివరకు విజయ తీరాలకు చేర్చింది. అనితర సాధ్యమైన పట్టుదలతో అందరినీ ఎదురించి ఏపీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి.

*తండ్రి మరణం. ఓదార్పుతో యుద్ధం
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఏపీని శోకసంద్రంలోకి నెట్టింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక వందలాది మరణించారు. వారిని ఓదార్చేందుకు కదిలిన జగన్ కు కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడింది. అంతే అక్కడి నుంచి కాంగ్రెస్ తో జగన్ యుద్ధం మొదలైంది. తండ్రిలాగే మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ ను ఎదురించి జగన్ ఓదార్పుయాత్ర నిర్వహించారు.

ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను అక్రమాస్తుల కేసు పెట్టించి జైలుకు పంపింది. వైఎస్ఆర్ ఉండగా రాని ఆరోపణలు ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడిపై వచ్చాయంటే దాని వెనుక రాజకీయ కోణం ఉందన్న జగన్ మాట జనంలోకి బాగా వెళ్లింది.. అయినా జగన్ కాంగ్రెస్ కు లొంగలేదు. సంవత్సరంన్నర పాటు జైలు జీవితం అనుభవించినా జగన్ తలవంచలేదు. అదే పోరాట పటిమతో కాంగ్రెస్ ను ఎదురిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు సాగారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు జగన్ వెంట ఉన్నది కేవలం ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. ఇద్దరితో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు గెలుచుకునే స్థాయికి చేరింది. ఇది ఏపీలోనే కాదు దేశంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

దేశంలో ఏ రాజకీయ సాహసించని విధంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ చేసిన 3600 కిలోమీటర్ల పాదయాత్రనే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ప్రజానాడిని పసిగట్టేలా చేసింది. అధికారం దక్కేలా చేసింది.

-నరేశ్