వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజున అరుదైన గిఫ్ట్ ను ఇచ్చి అందరినీ సంతోషపరిచారు. జగన్ బర్త్ డే రోజున అందరికీ భిన్నంగా ఆలోచించారు. ఓ చదువుల తల్లిని చేరదీశారు. పేదల ఆకలితీర్చేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ క్యాంటీన్లను రోజా ఏర్పాటు చేసి ప్రజల అభిమానం చూరగొన్నారు.. ప్రజల కనీస అవసరమైన తాగునీటి సమస్యను ప్రారదోలారు. స్కూళ్లకు ఫ్యూరిఫైడ్ వాటర్ అందించారు. నియోజకవర్గ ప్రజలకు రోజా తాగునీటిని అందించారు. ఎంతో మందికి కష్టాల్లో ఉన్న వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి సేవలందించారు. ఇప్పుడు జగనన్నకు అదిరిపోయే బర్త్ డే కానుక ఇచ్చారు.
నేడు సీఎం జగన్ 47వ పుట్టిన రోజు సందర్భంగా రోజా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ శ్రేణులకు పండుగ రోజు అయిన నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, నేతలు పండుగలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కొందరు కేక్ కట్ చేస్తున్నారు. కొందరు పండ్లు పంచుతున్నారు. కొందరు ఏదైనా సేవ చేస్తున్నారు. కానీ అందరిలోకి విభిన్నంగా జగనన్నపై ప్రేమను చాటుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా..
జగన్ కు ప్రతిసారి రాఖీ కట్టే రోజా.. అన్న పుట్టిన రోజున ఓ పేదింట ఆనందాన్ని విరబూయించింది. అమ్మా నాన్న లేని ఓ అమ్మాయిని అక్కున చేర్చుకొని ఆ అమ్మాయి కలను నెరవేర్చడానికి రెడీ అయ్యింది. అదే బాలికను మెడిసిన్ చదివించేందుకు రెడీ అయ్యి అదే జగనన్న పుట్టినరోజు సందర్భంగా తాను ఇస్తున్న కానుక అని రోజా చాటిచెప్పింది.
తిరుపతిలోని ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్న ఓ పేదింటి బాలికను చేరదీశారు. అమ్మానాన్న లేని అనాథ అయిన పి. పుష్పకుమారిని అక్కున చేర్చుకున్నారు.. చిన్నప్పుడే అమ్మానాన్న అనారోగ్యంతో చనిపోవడంతో కష్టపడి ప్రభుత్వ ఆశ్రమ విద్యాసంస్థల్లో చదవి 10వ తరగతిలో 10జీపీఏ సాధించింది. నీట్ లో కూడా బాగా రాసింది. కానీ తక్కువ మార్కులు రావడంతో మెడిసిన్ చదవలేకపోయింది. దీంతో ఈ బాలిక విషయం తెలుసుకున్న రోజా చలించిపోయారు. పేద అమ్మాయిని చేరదీశారు. ఆమె కోరిక మెడిసన్ చదివించాలన్నది రోజా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆమె హాస్టల్ కు వెళ్లి మరీ అమ్మాయి బాధ్యత తీసుకున్నారు. అనాథ బాలికను మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. జగనన్న బర్త్ డేకి ఆయన చెల్లెలిగా తాను పుష్ప కుమారిని చదివించడానికి బాలికను దత్తత తీసుకుంటున్నానని తెలిపింది. అనాథ బాలికను జగనన్న బర్త్ డే సందర్భంగా దత్తత తీసుకొని చదివించడానికి రెడీ అయిన రోజా మంచి మనసును అందరూ అభినందిస్తున్నారు.