Homeజ్యోతిష్యంToday Horoscope Rasi Phalalu : ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి.. నేటి (2023 అక్టోబర్...

Today Horoscope Rasi Phalalu : ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి.. నేటి (2023 అక్టోబర్ 12న ) రాశి ఫలాలివీ

Today Horoscope Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 12న గురువారం 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
కొన్ని రంగాల వారు తోటివారిని ఆకట్టుకుంటారు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల నుంచి అపార్థాల మూట కట్టుకోకండి.ఆత్మ విశ్వాసంతోముందుకు వెళితే అన్నీ శుభాలే. సూర్య దేవుడిని పూజిస్తే మరింత మంచిది.

వృషభం:
గతంలో మొదలుపెట్టిన ముఖ్యమైన పనులు తోటి వారి సహాయంతో పూర్తవుతాయి. బిడియం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏకాగ్రతతో పని చేస్తే అనుకున్నవి సాధిస్తారు. మనశ్శాంతి లోపించినప్పుడు చంద్ర ధ్యానం చేయండి.

మిథునం:
కొన్ని పనులు ప్రారంభించేముందు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. పట్టుదల, ఏకాగ్రతతో పనులు మొదలు పెడితే అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపు తప్పనిసరి. గణపతి దేవారాధన చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం:
కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ఆలోచనలు సత్ఫలితాల్నిస్తాయి. కొన్ని వర్గాల వారికి మనశ్శాంతి లోపించవచ్చు. అయితే ముందు చూపుతో పనులు చూస్తే సూర్య దేవునిని కొలిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

సింహం:
ఉద్యోగులు శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వర్గానికి చెందిన వారు ఆచితూచి వ్యవహరించాలి. ఒక వార్త ఈ రాశివారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అరోగ్యంగా ఉంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేష్ఠం.

కన్య:
పెద్దలతో వాదనలు దిగొద్దు. ప్లానింగ్ ప్రకారంగా పనులు చేయాలి. ఇప్పటి వరకు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు ఈశ్వరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తుల:
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మనోబలంతో కొన్ని విజయం సాధిస్తారు. ఉద్యోగార్థులకు అధికారుల అండదండలు ఉంటాయి. ఆరోగ్యకరంగా జీవిస్తారు. శివుడిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు.

వృశ్చికం:
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సక్సెస్ అవుతాయి. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అవసరానికి సాయం చేసేవారు ముందుకు వస్తారు. విష్ణు పూజలు అనుకూల ఫలితాలు.

ధనస్సు:
వ్యాపారం చేసేవారు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. అనవసర ఖర్చుల జోలికి పోకూడదు. భవిష్యత్ గురించి ప్రణాళిక వేస్తారు. వాదనలకు దిగొద్దు.. పట్టింపులకు వెళ్లకూడదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

మకరం:
మొదలుపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్లాలి. విమర్శలను పట్టించుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సూర్యనారాయణుడిని పూజించడం వల్ల అనుకున్నవి జరుగుతాయి.

కుంభం:
కొన్ని పనుల్లో కటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

మీనం:
కొన్ని కీలక నిర్ణయాలు లాభిస్తాయి. అయితే ఎవరినీ అతిగా నమ్మొద్దు. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేయాలి. శని ధ్యానం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Oktelugu Epaper