https://oktelugu.com/

Zika Virus: జికా వైరస్ కలకలం.. ఏపీ ప్రభుత్వం అలెర్ట్!

నెల్లూరు జిల్లాలో సరికొత్త వైరస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో యంత్రాంగం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 06:22 PM IST

    Zika Virus

    Follow us on

    Zika Virus: కరోనా ఏ స్థాయిలో విలయతాండవం సృష్టించిందో తెలియంది కాదు. శర వేగంగా విస్తరించి ప్రపంచాన్ని వణికించింది. ఆ పరిస్థితి గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది. అటువంటిది మరో వైరస్ ఏపీలో వెలుగులోకి వచ్చింది. జికా వైరస్ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. బాధితుడికి వెనువెంటనే అత్యున్నత వైద్య చికిత్సలు అందిస్తోంది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… బాధితుడు గ్రామంలో అందరికీ వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    * బాలుడిలో లక్షణాలు
    నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాలుడిలో జికా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తం అయ్యింది. బాలుడి రక్త నమూనాలను సేకరించి పూణే ల్యాబ్ కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గ్రామస్తుల నుంచి రక్తం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు.

    * స్పందించిన మంత్రి
    నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. బాలుడికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదని చెప్పారు. బాలుడికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు చెన్నై తరలించినట్లు వెల్లడించారు. ఒకవేళ వైరస్ నిర్ధారణ అయితే మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని.. ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆ గ్రామంలో 150 గృహాలు ఉన్నాయని.. ప్రతి కుటుంబానికి వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు పుకార్లు నమ్మవద్దని.. ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి రామనారాయణరెడ్డి కోరారు.