https://oktelugu.com/

Daaku Maharaaj: నందమూరి అభిమానులకు షాక్..ఓవర్సీస్ లో ‘డాకు మహారాజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు..అసలు ఏమైందంటే!

27 సినీ మార్క్ XD ప్రీమియర్ షోస్ ని షెడ్యూల్ చేసినప్పటికీ కూడా కేవలం రెండు వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడానికి సాంకేతిక లోపం కారణమని, అందుకే ప్రస్తుతానికి షెడ్యూల్ చేసిన షోస్ అన్నిటిని రద్దు చేసి, మళ్ళీ ఫ్రెష్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తాము అంటూ 'డాకు మహారాజ్' నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 06:36 PM IST

    Daaku Maharaaj

    Follow us on

    Daaku Maharaaj: సంక్రాంతి వచ్చిందంటే బాలయ్య సినిమా ఉండాల్సిందే..ఎప్పుడో రెండు మూడు సార్లు సంక్రాంతి మిస్ అయ్యుండొచ్చేమో కానీ, ఆయన కెరీర్ లో మైలురాయిగా నిల్చిన చిత్రాలన్నీ అధికశాతం సంక్రాంతికి విడుదలైనవే ఉన్నాయి. అలా ఈ సంక్రాంతికి కూడా ఆయన ‘డాకు మహారాజ్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీ బాలయ్య తో తీస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రం పై అంచనాలు అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా భారీగా ఏర్పడ్డాయి. విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి, అదే విధంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభించారు డిస్ట్రిబ్యూటర్లు. లండన్ లో ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి కానీ, నార్త్ అమెరికా లో మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదు.

    27 సినీ మార్క్ XD ప్రీమియర్ షోస్ ని షెడ్యూల్ చేసినప్పటికీ కూడా కేవలం రెండు వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడానికి సాంకేతిక లోపం కారణమని, అందుకే ప్రస్తుతానికి షెడ్యూల్ చేసిన షోస్ అన్నిటిని రద్దు చేసి, మళ్ళీ ఫ్రెష్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తాము అంటూ ‘డాకు మహారాజ్’ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియా లో భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అడ్వాన్స్ బుకింగ్స్ సరిగా జరగకపోవడంతో ఈ సాకుని చెప్పి షోస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసారని, డిస్ట్రిబ్యూటర్ కి బాలయ్య ఫేవరెట్ హీరో కాబట్టి ఇలా కవర్ చేసుకున్నదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

    కేవలం సాంకేతిక లోపం వల్లనే షోస్ ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. కేవలం ‘డాకు మహారాజ్’ కి మాత్రమే కాదు, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా పలు షోస్ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అభిమానులకు టికెట్స్ బుక్ అవ్వకపోవడం తో పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరిచారు.ఇకపోతే గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల క్రితం ప్రారంభించగా, రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సరిగా షోస్ ని అప్డేట్ చేయట్లేదని, చాలా గ్రాస్ ని మిస్ అవుతున్నామని ఆ సంస్థ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. అభిమానుల ఒత్తిడికి దిగొచ్చిన శ్లోకా ఎంటర్టైన్మెంట్స్, అత్యధిక XD షోస్ ని అప్డేట్ చేయడం తో గేమ్ చేంజర్ బుకింగ్స్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి.