Prasad Behara: యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ ఫేమస్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. ఆయన నటించిన పలు షార్ట్ ఫిలిమ్స్, వైరల్ అయ్యాయి. విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇటీవల మెకానిక్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు. అది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రసాద్ బెహ్రాకు వెండితెర ఆఫర్స్ సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన కమిటీ కుర్రోళ్ళు సినిమాలో ప్రసాద్ బెహ్రా ఒక కీలక రోల్ చేశాడు. కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ కావడంతో ప్రసాద్ బెహ్రా నటనకు ప్రశంసలు దక్కాయి.
అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి చిత్రంలో కూడా ప్రసాద్ బెహ్రా కీలక రోల్ చేయడం విశేషం. నటుడిగా ఎదుగుతున్న తరుణంలో ప్రసాద్ బెహ్రాకి భారీ షాక్ తగిలింది. అతడు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. తనతో పాటు వెబ్ సిరీస్లో నటించిన ఓ నటి కేసు పెట్టింది. లైంగికంగా తనను వేధించాడని ఆమె ఫిర్యాదు పేర్కొంది. సెట్స్ లో అందరు ముందు తనను అసభ్యకరంగా తాకాడట. ఎందుకు అలా టచ్ చేసావని అడగ్గా.. జో చేస్తున్న అన్నాడట.
సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యకరంగా మాట్లాడటం, పబ్లిక్ లో ప్రైవేట్ పార్ట్స్ తాకడం చేస్తూ.. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని యువతి కంప్లైంట్ లో పొందు పరచింది. యువతి ఫిర్యాదు ఆధారంగా ప్రసాద్ బెహ్రాను బుధవారం అరెస్ట్ చేశారు. ప్రసాద్ బెహరపై 75(2), 79, 351(2)BNS సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రసాద్ బెహ్రాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనూహ్యంగా ప్రసాద్ బెహ్రా కటకటాల పాలయ్యాడు. పరిశ్రమలో లైంగిక వేధింపులను తగ్గించాలని ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కంట్రోల్ కావడం లేదు. ఆ మధ్య పుష్ప సిరీస్లో కీలక రోల్ చేసిన జగదీష్ సైతం లైంగిక ఆరోపణలు ఎదుర్కున్నాడు. యువతిని బ్లాక్ మెయిల్ చేయడమో