YSR View Point: వైఎస్సార్‌ పేరు.. చెరిపేస్తున్నారు..

ఏపీలో అధికారం మారడంతో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీ వేధింపులు భరించిన టీడీపీలో ఆగ్రహం కట్టలు తెగుతోంది. విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును ధ్వంసం చేశారు.

Written By: Raj Shekar, Updated On : June 5, 2024 9:30 am

YSR View Point

Follow us on

YSR View Point: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. లోక్‌సభ ఎన్నిల కౌంటింగ్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు చిత్తయ్యారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లే ఆ పార్టీకి దక్కాయి. కంచుకోటలో కూడా వైసీపీని ఏపీ ఓటర్లు ఓడించారు. 2019 ఎన్నికల ఫలితాల్లో 150 స్థానాలు సాధించిన వైసీపీ, టీడీపీని ఘోరంగా ఓడించింది. 2024లో ఇప్పుడు టీడీపీ అధికార వైసీపీని అంతకన్నా దారుణంగా ఓడించింది. ఐదేళ్లలో వైసీపీపై ఏపీ ప్రజల్లో కట్టలు కట్టుకున్న తీవ్ర వ్యతిరేకతకు ఇదే నిదర్శనం.

మారుతున్న పరిణామాలు..
ఏపీలో అధికారం మారడంతో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీ వేధింపులు భరించిన టీడీపీలో ఆగ్రహం కట్టలు తెగుతోంది. విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును ధ్వంసం చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ అనే అక్షరాలను తొలగించారు. దాని స్థానంలో ఎన్టీఆర్‌ అనే అక్షరాలను తగిలించారు. ఎన్టీ.రామారావు, చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

ఐలవ్‌ వైజాగ్‌ ధ్వంసం..
తాజాగా విశాఖపట్నంలో వైజాగ్‌ బీచ్‌ రోడ్‌లో జగన్‌ ప్రభుత్వం నిర్మించిన వ్యూ పాయింట్‌ పేరును గుర్తుతెలియని వ్యక్తులు మార్చివేశారు. నిన్నటి వరకు డాక్టర్‌ వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా ఉండగా, నేమ్‌ బోర్డ్‌లో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ అనే అక్షరాలను తొలగించి.. వాటి స్థానంలో అబ్దుల్‌ కలాం పేరును అంటించారు.