Junior NTR: సిగ్గుండాలి సార్ అంటూ ఆయన్ని ఉద్దేశించి మాట్లాడిన ఎన్టీయార్… వైరల్ వీడియో…

జూనియర్ ఎన్టీఆర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే ప్రోగ్రాం కి హోస్టుగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే...అయితే ఈ ప్రోగ్రాం లో తెలుగు పోయెమ్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఎన్టీఆర్ తన కంటెస్టెంట్ ని అడిగాడు.

Written By: Gopi, Updated On : June 5, 2024 9:39 am

Junior NTR

Follow us on

Junior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ మూడో తరం నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్..తన మొదటి సినిమాతో తడబడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఎన్టీయార్ ఒకప్పుడు సిగ్గుండాలండి అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఏ ఉద్దేశంతో, ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

జూనియర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ప్రోగ్రాం కి హోస్టుగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే…అయితే ఈ ప్రోగ్రాం లో తెలుగు పోయెమ్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఎన్టీఆర్ తన కంటెస్టెంట్ ని అడిగాడు. ఆ కంటెస్టెంట్ కూడా తనకి సరైన ఆన్సర్ తెలియదని చెప్పాడు. ఇక దాంతో ఎన్టీఆర్ నాకు కూడా దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే తెలీదని చెప్పడంతో ఆ పక్కనే కూర్చున్న ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక పాప సర్ దానికి ఆన్సర్ ‘గుర్రం జాషువా’ అని చెబుతుంది. దాంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ షాక్ కి గురవుతాడు.

8వ తరగతి చదువుతున్న పాపకి ఆన్సర్ తెలుసా అంటూ తను ఆ పాప చెప్పిన ఆన్సర్ కి సంతోష పడుతూనే తనకి, తన కంటెస్టెంట్ కి ఆన్సర్ తెలియనందుకు ‘మనకు సిగ్గుండాలండి ఎనిమిదవ తరగతి పాపకు తెలిసినంత కూడా మనకు తెలియదు’ అంటూ ఎన్టీఆర్ షాపింగ్ కామెంట్స్ చేశారు.

ఇక అప్పుడెప్పుడో జరిగిన ఈ ప్రోగ్రాం లోని ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఆ పాపకి ఉన్న నాలెడ్జ్ గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమె కూడా ఒకప్పుడు ఎన్టీయార్ చదివిన విజ్ఞాన్ స్కూల్లోనే చదువుతుందని తెలుసుకొని షాక్ అయ్యాడు…అలాగే వాళ్ల టీచర్స్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ఆ పాప నాలెడ్జ్ కి మెచ్చుకున్న ఎన్టీఆర్ తను ఫ్యూచర్ లో చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని కూడా చెప్పడం విశేషం…