NTR Vs Rajinikanth: ఎన్టీయార్ రజినీకాంత్ కి మధ్య పోటీ తప్పట్లేదా..? వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారంటే..?

తెలుగు లో యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న 'దేవర ' సినిమా కూడా దసర కానుక గా ప్రేక్షకులకు ముందు రాబోతుంది అంటూ మేకర్స్ ఇంతకుముందే అనౌన్స్ చేశారు.

Written By: Gopi, Updated On : June 5, 2024 9:23 am

NTR Vs Rajinikanth

Follow us on

NTR Vs Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఒకరి సినిమాలు థియేటర్ కి వచ్చినప్పుడు మరొక హీరో సినిమాలు కూడా పోటీలో నిలుస్తూ ఉంటాయి. దీనివల్ల అభిమానులు వాళ్ల హీరోకి సపోర్ట్ చేస్తూ ఆ సినిమాలను సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తోనే తమ అభిమాన హీరోల సినిమాలను ఎక్కువగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలి ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దసర కనుక గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇక తెలుగు లో యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘దేవర ‘ సినిమా కూడా దసర కానుక గా ప్రేక్షకులకు ముందు రాబోతుంది అంటూ మేకర్స్ ఇంతకుముందే అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ తప్పేట్టుగా లేదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి రజినీకాంత్, ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒకసారి కూడా బాక్సాఫీస్ వద్ద తలపడలేదు.

మరి ఈసారి మాత్రం భారీ రేంజ్ లో తలపడబోతున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం.. ఇక ఈ ఇద్దరు హీరోలకి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఉండటం కూడా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి. మరి ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకుముందే రజనీకాంత్ ‘జైలర్ ‘ అనే సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ గత చిత్రం అయిన త్రిబుల్ ఆర్ తో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో వార్ 2 అనే సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ కూడా భారీ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అనేది…