Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి నగిరి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఆయన మాజీమంత్రి రోజాతో సమావేశం అయ్యారు. ఆమె అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి కాస్త దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఇతర రాష్ట్రాల్లో ఉండి రాజకీయం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యేక వీడియోలతో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆమె సైలెంట్ గా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కాస్త యాక్టివ్ గానే బయటకు వచ్చారు. కానీ రోజా జాడ కనిపించలేదు. దీంతో నగిరి విషయంలో రోజాకు వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
* జగదీష్ చేరికపై ప్రచారం
కొద్దిరోజుల కిందట నగిరి( nagiri) నియోజకవర్గానికి చెందిన గాలి జగదీష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన స్వయాన సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు. ప్రస్తుత నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు. గత కొద్దిరోజులుగా సోదరుడితో విభేదిస్తున్న జగదీష్ టిడిపిలో ఉంటే గుర్తింపు దక్కదని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే జగదీష్ వస్తే తన పరిస్థితి ఏంటని రోజా ప్రశ్నించినట్లు సమాచారం. అందుకే జగదీష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.
* జగన్ తో రోజా భేటీ
అయితే నిన్న తాడేపల్లి( Tadepalli) కార్యాలయానికి మాజీ మంత్రి రోజా వచ్చినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయినా ఆమె జగదీశ్ రాకను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంత్రి రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం ఉంది. వారికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోజా ఉండకూడదని పెద్దిరెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అందుకే జగదీష్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెప్పించేందుకు పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపినట్లు ప్రచారం నడిచింది. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి రోజా తన వెంట ఉండడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో రోజా అయితే సహకరించేది లేదని నగిరి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. అందుకే జగదీష్ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
* జగదీష్ వైపే మొగ్గు
ప్రస్తుతం నగిరి నియోజకవర్గంలో టిడిపి కూటమి( TDP Alliance ) బలంగా ఉంది. ఆ బలాన్ని ఢీకొట్టాలంటే రోజా బలం చాలదు. అందుకే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబానికి చెందిన జగదీష్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. రోజాకు పార్టీలో ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని.. తప్పుకోవాలని జగన్ సూచించినట్లు సమాచారం. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. ప్రత్యర్థులను తట్టుకుని నిలబడ్డానని.. తనను పక్కన పెట్టడం భావ్యం కాదని రోజా వాదించినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే రోజా వ్యవహారం, జగదీష్ చేరిక విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.