Mad Square Teaser Review: యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘మ్యాడ్'(MAD Movie). 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమా గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రేంజ్ కి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీక్వెల్ కోసం యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తుండగా, మార్చి 29 న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ కి ఊహించిన విధంగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి భాగం కంటే రెండవ భాగం లో ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా ఉందని అర్థం అవుతుంది.
మొదటి భాగం మొత్తం కాలేజ్ నేపథ్యం లో సాగుతుంది. కానీ రెండవ భాగం మాత్రం లడ్డు పెళ్లి నేపథ్యం లో సాగుతుందని ఈరోజు టీజర్ ని చూసిన తర్వాతే తెలిసింది. మొదటి భాగం లో నాలాంటోడికి ఏ అమ్మాయి పడుతుంది?, నాకు పిల్లని ఎవరిసారు అని లడ్డు బాధపడుతూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ రెండవ భాగంలో హీరోయిన్ లాంటి అమ్మాయితో లడ్డు పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన అతని స్నేహితులు, వాళ్ళు చేసే రచ్చ ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. టీజర్ ప్రారంభం నుండి, ఎండింగ్ వరకు నవ్వులే నవ్వులు. మొదటి భాగం లో సంగీత్ శోభన్ కామెడీ బాగా క్లిక్ అయ్యింది. రెండవ భాగం లో కూడా మొత్తం అతనిదే డామినేషన్. ఆయన డైలాగ్స్ ఈ టీజర్ లో బాగా పేలాయి. పెళ్లి నాదా నీదా అని లడ్డు సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ని అడిగినప్పుడు, నాకు బిచ్చగాడి బట్టలు వేసినా నీకంటే అందంగా కనిపిస్తాను మామా అని డైలాగ్ కొడుతాడు.
ఇక లడ్డు నాన్న స్నానం చేసి వీళ్ళను చూసిన వెంటనే టవల్ విప్పేసాడు, అప్పుడు సంగీత్ శోభన్ క్రింద వైపుకి చూస్తూ నమేస్తే పెద్దనాన్న అని అనడం చాలా కామెడీ గా అనిపించింది. మన వల్ల ఇక్కడ ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదు మామా అని సిగరెట్ కాల్చి పక్కన వేసినప్పుడు బగ్గుమని మంటలు వచ్చే షాట్ కూడా సరదాగా అనిపించింది. ఇక చివర్లో విలన్ బేస్ వాయిస్ తో వీళ్లకు ఫోన్ చేసినప్పుడు ‘భాయ్’ అని గంభీరంగా మాట్లాడుతాడు. అంటే నేను భాయ్ ని రా అని చెప్పడం అన్నమాట. అప్పుడు సంగీత్ శోభన్ ఒక బాయ్ అని ఫోన్ కట్ చేయడం టీజర్ మొత్తం మీద హైలైట్ గా నిల్చింది. ఈ షాట్ ని మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకోవచ్చు. ఓవరాల్ గా ‘MAD Square’ టీజర్ అదిరిపోయింది, ఇదే విధంగా సినిమా కూడా ఉంటే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.