Homeఆంధ్రప్రదేశ్‌YCP New working presidents: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!

YCP New working presidents: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!

YCP New working presidents: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న క్రమంలో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధపడుతున్నారు. ప్రజల మధ్యకు వెళ్లేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో మిగతా నాయకులను క్రియాశీలకం చేస్తున్నారు. అందులో భాగంగా యువతకు ప్రాధాన్యం ఇస్తూ కార్యవర్గాలను నియమిస్తున్నారు. కూటమి దూకుడుగా ఉన్న నేపథ్యంలో యువ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ధీటుగా ఎదుర్కొంటారని ఆలోచన చేస్తున్నారు. అందుకే యువజన విభాగాన్ని మరింత పటిష్టం చేశారు జగన్. యువజన విభాగానికి కొత్తగా ఐదుగురు యువనేతలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: చివరకు పెళ్లిని వదల్లే.. జగన్ జన సమీకరణ పిచ్చి

కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లు గా అన్నం రెడ్డి అదీప్ రాజు, కారుమూరి సునీల్ కుమార్, పేర్ని కిట్టు, భూమన అభినయ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నియామకం అయ్యారు. వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు బాధ్యులుగా నిర్మించారు. ఆ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అధ్యక్షుడితో కలిసి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. ఈయన మాజీ ఎమ్మెల్యే కూడా.
* అన్నం రెడ్డి అదీప్ రాజుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి బాధ్యతలు అప్పగించారు.
* కారుమూరి సునీల్ కుమార్ కు కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
* పేర్ని కిట్టుకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల బాధ్యతలు ఇచ్చారు.
* భూమన అభినయ రెడ్డికి ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు.
* బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైయస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల బాధ్యతలను కేటాయించారు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular