https://oktelugu.com/

Y S Vijayamma: ఫ్యామిలీ పాలిట్రిక్స్ : విజయమ్మ vs భారతి ల దెబ్బకు జగన్ విలవిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల, కుమారుడు జగన్మోహన్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం అంతకంతకూ విస్తరిస్తోంది. మొన్నటిదాకా షర్మిల విమర్శలు, జగన్ లేఖలు, సాక్షిలో షర్మిల మీద రాతలు.. ఇలా సాగిపోయింది ఆ ఎపిసోడ్. అయితే ఆకస్మాత్తుగా ఆ సీన్లోకి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు. ఒక లేఖ రాసి మీడియా అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 30, 2024 8:23 am
    Y S Vijayamma

    Y S Vijayamma

    Follow us on

    Y S Vijayamma: విజయమ్మ లేఖ.. అంతకుముందు షర్మిల చెప్పిన మాటలు.. ఈ వ్యవహారంలో భారతి పాత్ర.. మొత్తంగా చూస్తే జగన్ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పాలిట్రిక్స్ లో అతడు విలవిలలాడుతున్నట్టు అర్థమవుతోంది. షర్మిలపై ఏకపక్షంగా జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక.. తాను నిజాలు మాత్రమే చెబుతున్నానని..ఇందులో రాగద్వేషాలకు తావు లేదని విజయమ్మ స్పష్టం చేశారు.. “ఆస్తుల విభజన చేద్దామని ముందుగా జగనే అన్నారు. ఎంవోయూ కూడా ఆయన చేశారు. జగన్ చెబుతున్నవి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలు. మా కుటుంబ బంధువులుగా వారు ఎంవోయూ పై సంతకాలు చేశారు. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. ఆ ఎంవోయూ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి 60%, షర్మిలకు 40 శాతం ఆస్తుల విభజన జరగాలి. దానికంటే ముందు చెరి సగం డివిడెంట్ స్వీకరించేవారు. ఎంవోయూ లో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ కానుకగా ఇస్తున్నవి కాదు. అది అతడి బాధ్యత. సరస్వతి షేర్స్ 100%, యలహంక లో ఆస్తిని 100% షర్మిలకు ఇస్తానని నాడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు. సంతకం కూడా పెట్టాడు.. అయితే అవి ఇవ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిలకు ద్రోహం జరిగిందని” విజయమా లేఖలో ప్రస్తావించారు.

    తెర వెనుక ఉన్నది ఎవరు?

    జగన్ – షర్మిల మధ్యలో ఆస్తుల వివాదం ఈ స్థాయిలో చెలరేగడానికి ప్రధాన కారణం భారతి అని ఓ వర్గం ఆరోపిస్తోంది.. పైగా ఆస్తుల కోసం భారతి ఒత్తిడి తీసుకురావడం వల్లే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆ వర్గం చెబుతోంది..” కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో షర్మిల తన అన్న గురించి గొప్పగా చెప్పింది. ఆమెను జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు లాగా చూసుకుంటాడని మురిసిపోయింది. తనకు ఏ కష్టం వచ్చినా అడ్డు నిలబడిపోతాడని ఆనందపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పరస్పరం విమర్శలు చేసుకునే దాకా వచ్చింది. అన్న కోసం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల నేడు ఎంతో బాధతో తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ దీనిని జగన్ ప్రతి కుటుంబంలో జరుగుతున్న గొడవ లాగానే చెబుతున్నాడు.. అయితే ఈ వివాదం వెనక భారతి పాత్రను కొట్టి పారేయలేం. ఎందుకంటే చెల్లి, తండ్రి విషయంలో జగన్ ఇంత మొండిగా ఉన్నాడంటే దానికి కారణం ఆమె కాకపోతే మరెవరూ అని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే అటు విజయమ్మ, ఇటు భారతి మధ్య జగన్మోహన్ రెడ్డి నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది. చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో..