https://oktelugu.com/

ICC Ranking 2024: మహిళా క్రికెటర్ల ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ.. మనవాళ్లు ఏ స్థానాల్లో ఉన్నారంటే..

టి20 వరల్డ్ కప్ లో ఓడిపోయారు. నిరాశగా ఇంటికి వచ్చారు. ఆ టోర్నిలో న్యూజిలాండ్ విజయం సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుగు పెట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 30, 2024 / 08:40 AM IST

    ICC Ranking 2024

    Follow us on

    ICC Ranking 2024: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ ఆడింది. అయితే భారత జట్టు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మూడు వన్డేలలో భారత్ తొలి, చివరి వన్డేలు గెలిచి సిరీస్ దక్కించుకుంది. మొత్తంగా టి20 వరల్డ్ కప్ లో ఎదురైనా పరాభవానికి గట్టిగా బదులు తీర్చుకుంది. టీమిండియా సాధించిన ఈ విజయం నేపథ్యంలో.. మహిళా క్రికెటర్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది.. మంగళవారం రాత్రి ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత జట్టు ప్లేయర్ దీప్తి శర్మ సత్తా చాటింది. వన్డే సిరీస్ లో అద్భుతమైన ప్రతిభ చూపడంతో.. ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ అదే జోరు కొనసాగించింది. 687 పాయింట్లతో దీప్తి శర్మ రెండవ స్థానంలో నిలిచింది. ఆల్ రౌండర్లా విభాగంలోనూ అదరగొట్టింది. ఏకంగా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. చివరి వన్డేలో సెంచరీ చేసిన స్మృతి.. బ్యాటింగ్ విభాగంలో నాలుగో స్థానాన్ని సాధించింది.. ఐసీసీ ప్రకటించిన మొత్తం మూడు కేటగిరిలలో భారత జట్టు నుంచి దీప్తి, స్మృతి మందాన టాప్ -10 లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్ అగ్రస్థానంలో ఉంది. టి20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా.. రెండవ స్థానంలో ఉంది. లంక కెప్టెన్ చమరి ఆట పట్టు మూడో స్థానంలో ఉంది. స్మృతి మందాన నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

    ఆల్ రౌండర్ ల జాబితాలో..

    ఐసీసీ ప్రకటించిన ఆల్ రౌండర్ ల జాబితాలో దక్షిణాఫ్రికా ప్లేయర్ మరినే అగ్రస్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ చెట్టు కెప్టెన్ హేలీ మ్యాథ్యూస్ రెండో స్థానంలో ఉంది. నాట్ సీవర్ బ్రంట్ మూడో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది.. ఇక ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అమేలీయ కేర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ ఏడవ ర్యాంకు దక్కించుకుంది..కాగా, టి20 వరల్డ్ కప్ లో నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించిన నేపథ్యంలో భారత ప్లేయర్లలో ఇద్దరు మాత్రమే టాప్ -10 లో నిలిచారు. ఒకవేళ టీమిండియా కనుక విజేతగా నిలిచి ఉంటే.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటేవారు.. టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. భారత జట్టుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. అయితే టి20 వరల్డ్ కప్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే రికవరీ అయింది. టి20 వరల్డ్ కప్ సాధించిన న్యూజిలాండ్ స్వదేశంలో ఓడించి వన్డే ట్రోఫీ దక్కించుకుంది. అంతేకాదు ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ ప్లేయర్లు సత్తా చాటారు. ఇద్దరు మాత్రమే టాప్ -10 లో ఉన్నప్పటికీ భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా.. టీమ్ ఇండియా ప్లేయర్లు మరింత ఉన్నతమైన స్థానాలను అధిరోహించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.