YS Jagan Satires on CBN: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)+తరచు మీడియా సమావేశాలు పెడుతుంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో ఆయన అసెంబ్లీకి వెళ్లకపోయిన సంగతి తెలిసిందే. శాసనసభకు వెళితే సమయం ఇవ్వరని.. అందుకే మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. వారాంతంలో బెంగళూరు వెళ్లి.. మూడు రోజులపాటు తాడేపల్లి కి వచ్చి గడుపుతున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఈ వారంలో చేసిన పనులను ఎత్తిచూపుతున్నారు. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలు మాట రావడం లేదు. అది కూడా మీడియా ప్రతినిధులు అడిగితేనే స్పందిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్… ఈ ముగ్గురిపై విమర్శలు చేస్తూ తరువాత అక్కడ నుంచి జారుకుంటున్నారు. ఈరోజు కూడా అదే మాట్లాడారు.
అమరావతి ప్రస్తావన..
జగన్మోహన్ రెడ్డి పై రాజధాని వైఫల్యం ఉంది. అమరావతి రాజధానిని( Amravati capital) కాదని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆ మూడు రాజధానులను నిర్మించలేకపోయారు. అమరావతిని కొనసాగించలేక నిర్వీర్యం చేశారు. అయితే ఈరోజు మీడియా ప్రతినిధి అదనపు భూ సమీకరణ గురించి ప్రస్తావించారు అమరావతిలో. వెంటనే స్పందించిన జగన్మోహన్ రెడ్డి 53 వేల ఎకరాలను అప్పట్లో సేకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు మరో 20వేల ఎకరాలు సేకరిస్తున్నారని.. ప్రతి ఎకరాకు మౌలిక వస్తువుల కల్పనకు రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కొత్త లెక్క చెప్పారు. ఈ క్రమంలో ఆయన అమరావతి గురించి ప్రస్తావించడం మాత్రం శుభపరిణామమే. ఎందుకంటే అమరావతిని సంబోధించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని అమరావతి గురించి ప్రస్తావించారు.
చేసినది చెప్పుకుంటే తప్ప..
ఎందుకో జగన్మోహన్ రెడ్డి చేయలేనిది మిగతా వారు చేస్తే ఆయనకు కోపం అన్నట్టు ఉంది. సచివాలయంలో ఆర్టిజిఎస్ ( RTGS) కేంద్రంగా మొన్నటి తుఫాన్ సహాయక చర్యలతో పాటు ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు గడిపారు. మంత్రి నారా లోకేష్ రాత్రంతా అక్కడే ఉండిపోయిన సందర్భాన్ని మనం చూసాం. ప్రభుత్వ చర్యలతో తుఫాన్ నష్టం భారీగా జరగకుండా నియంత్రణ సాధ్యమైందని యంత్రాంగం కూడా ప్రస్తావించింది. ఈ విషయంలో ప్రభుత్వం పట్ల సానుకూలత వచ్చింది. అయితే దీనిపై ఈరోజు స్పందించారు జగన్మోహన్ రెడ్డి. ఆర్టిజిఎస్ కేంద్రంలో ఉండి ఓవర్ బిల్డప్ ఇచ్చారని.. తుఫాను ను అడ్డుకున్నది తామేనని ప్రజల్లో ప్రచారం చేసుకున్నానని ఎద్దేవా చేశారు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి తాను చేసింది చెప్పుకోలేకపోయానని పలుమార్లు అనడం మనం వినే ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు చెప్పలేదు కానీ తుఫాన్ అడ్డుకున్నానని.. కానీ ఇలా ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబుపై అదే పనిగా బురద జల్లితే అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికే నష్టం.
ఆర్టీజీఎస్ లో కూర్చోని వీళ్ళే మోంథా తుఫాన్ని తిప్పి పంపినట్టు బిల్డప్ ఇచ్చారు.#YSJaganPressMeet #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects pic.twitter.com/WfQacM0r1f
— Jagananna Connects (@JaganannaCNCTS) December 4, 2025