Liquor delivery in AP: ఏపీలో మద్యం విషయంలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఓవైపు వైసిపి హయాంలో మద్యం కుంభకోణం పై దర్యాప్తు జరుగుతోంది. ఇంకోవైపు కల్తీ మద్యం కలకలం సృష్టించింది. అధికారంలో ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై బురదజల్లేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని నడిపినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ రెండు కేసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మెడకు చుట్టుకున్నాయి. అయినా సరే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నాలు ఆగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం లో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్కూటీపై సంచుల్లో..
స్కూటీపై ఒక వ్యక్తి.. రెండు వైపులా సంచుల్లో మద్యం ఉంచిన వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఆ స్కూటీకి సంబంధించిన బ్యాక్ నంబర్ ప్లేట్ కనిపించడం లేదు. ముందు నంబర్ ప్లేట్ కనిపించి కనిపించినట్టుగా వీడియో తీశారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు తీసారా? లేకుంటే నిజంగానే ఇంటింటికి మద్యం సరఫరా చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కల్తీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన తరువాత.. ఇటువంటివి నమ్మశక్యంగా లేవు. పైగా ఇంటింటికి సరఫరా చేసేందుకు అందులో కాస్ట్లీమద్యం లేదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి కూడా.
అదే పనిగా ప్రచారం..
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా( social media) గత 18 నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వ్యతిరేక ప్రచారానికి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అలవాటు పడింది కూడా. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కల్తీ మద్యం డంప్ వెలుగు చూసింది. ఆ మరుసటి రోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో స్వయంగా సాక్షి మీడియాను తీసుకెళ్లి నకిలీ మద్యం డంపును బయటపెట్టారు. అటు తరువాత ఈ కేసులో ప్రధాన నిందితుడు జోగి రమేష్ పేరు చెప్పడం.. ఆయన అరెస్టు కావడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలు కూడా అదే తరహాలో ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
వావ్.. ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ
కల్తీ మద్యం.. ఇప్పుడు ఇంటి వద్దకే మద్యం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో లేబుళ్లు లేని మద్యం ని ఇంటింటికి సరఫరా చేస్తున్న వ్యాపారులు
ఇంటింటికి మద్యం సరఫరా జరుగుతున్న పట్టిపట్టనట్లుగా ఉన్న అధికార యంత్రాంగం pic.twitter.com/RTKaAKBr0o
— greatandhra (@greatandhranews) December 4, 2025