Vangaveeti Asha Kiran News: రాజకీయాల్లో తోబుట్టువులంటే భయపడుతున్న రోజులు ఇవి. ఎందుకంటే భారతదేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో తోబుట్టువులతోనే యువనేతలకు ప్రమాదం పొంచి ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీహార్లో ఓడిపోయిన తేజస్వి యాదవ్ కు కూడా ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న కేటీఆర్ కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పనవసరం లేదు. అంతెందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ కు సైతం అదే పరిస్థితి ఎదురయింది. అయితే ఇప్పుడు ఏపీలో మరో తోబుట్టువు రంగంలోకి దిగడంతో.. ఆ సోదరుడు పరిస్థితి ఏంటి అనే చర్చ నడుస్తోంది. బడుగుల ఆశాజ్యోతి గా, కాపుల వాయిస్ గా ఉండే వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశాకిరణ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతుండడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఆమె తన సోదరుడుతో విభేదించి ఈ నిర్ణయానికి వచ్చారా? లేకుంటే తన సోదరుడు రాజకీయాల్లో ఫెయిలయ్యారని భావిస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చ. కానీ ఆమె మాత్రం తన సోదరుడితో విభేదాలు లేవని చెబుతున్నారు.
సోదరులతో విభేదాలు..
సోదరుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎనలేని అభిమానం, ప్రేమతో గడిపారు షర్మిల. అన్న జైలులో ఉంటే ఆయన తరుపున పాదయాత్ర చేశారు. కాలికి బలపం కట్టుకుని తిరిగారు. వారిద్దరూ కలిస్తే అనురాగానికి, ఆప్యాయతకు మారుపేరుగా ఉండేది. కేవలం రాజకీయ విభేదాలతో ప్రారంభమైన వారిద్దరి మధ్య గ్యాప్.. ఇప్పుడు రాజకీయ బద్ధ శత్రువులుగా మార్చింది. తెలంగాణలో కల్వకుంట్ల వారి ఇంట్లో కూడా అదే పరిస్థితి. అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే ఉంది. తలో దిక్కుగా పార్టీని చూసుకున్నారు. కానీ ఇప్పుడు సోదరుడు కేటీఆర్ ను ధిక్కరిస్తున్నారు కవిత. దీంతో వారి మధ్య సైతం మాటల యుద్ధం జరుగుతోంది. మొన్న ఆ మధ్యన బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన తేజస్వి యాదవ్ పై సొంత చెల్లెలి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే చెల్లెలు క్రియాశీలకం అవుతుంటే.. అన్నలు వివాదాస్పదంగా మారుతున్నారు.
సోదరుడు ఉండగానే..
అయితే ఇప్పుడు మోహన్ రంగా కుమార్తె పొలిటికల్ ఎంట్రీ అనేది ఎందుకు అనేది చర్చ. ఎందుకంటే మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ రెండు దశాబ్దాల కిందటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభం అదుర్స్ గా ఉన్న.. తరువాత తప్పటడుగులు మూలంగా పొలిటికల్ గా ఫీల్ అయ్యారన్న విమర్శ ఉంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారే కానీ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. అలాగని టిడిపి సైతం ఇంతవరకు పదవులు ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆశాకిరణ్ తన తండ్రి పేరిట హడావిడి చేస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనేది ఒక అనుమానం. తన సోదరుడితో విభేదించి ఆమె ఈ నిర్ణయానికి వచ్చారా? లేకుంటే ఆయన రాజకీయంగా అనుకున్న స్థాయిలో రాణించ లేకుంటే ఆయన రాజకీయంగా అనుకున్న స్థాయిలో రాణించ లేరని బాధతో వచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రాధాకృష్ణతో విభేదించకపోతే ఆమె గొప్ప చెల్లెలుగా నిలిచిపోతారు. విభేదించి వస్తే మాత్రం షర్మిల తో పాటు కవిత సరసన చేరిపోతారు. మరి ఏం జరిగిందో అన్నది భవిష్యత్తులో తేలుతుంది. తప్పకుండా బయటపడుతుంది కూడా.