YS Jagan Mohan Reddy Criticism: సాధారణంగా ఎవరినైనా వ్యతిరేకిస్తే వారి చర్యలు మనకు నచ్చవు. వారి గొప్పతనం కూడా మనం గుర్తించలేం. సమాజంలో గౌరవ మర్యాదలను సైతం సహించలేం. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తన రాజకీయ ప్రత్యర్థులకు వస్తున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఉప ప్రధాని అంటే తట్టుకోలేకపోతున్నారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళితే తట్టుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా పొగిడితే తట్టుకోలేకపోతున్నారు. ఆయన లో అసహనం.. కనిపిస్తున్న ఫ్రస్టేషన్ చూస్తే మాత్రం.. రాజకీయ ప్రత్యర్థులపై ఈ రేంజ్ లో ఉంటుందా? అభిప్రాయం అన్నట్టు కనిపిస్తోంది. వారం వారం మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నట్టు చెబుతున్నారు జగన్. కానీ ఆయన తన ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
* ఎక్కువగా జాకీల పద ప్రయోగం..
నిన్ననే మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువగా జాకీలు అన్నమాట వాడారు. సాధారణంగా జాకీలు అంటే పైకి లేచి ఒక రకమైన సహాయ యంత్రం. వారాంతపు మీడియా సమావేశానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముందు మీడియా ప్రతినిధులు కొత్త కొత్త విషయాలను పెట్టారు. చంద్రబాబు ఉప ప్రధాని( vice prime minister ) కాబోతున్నారని.. టిడిపి అనుకూల మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. అయితే అప్పుడప్పుడు చంద్రబాబును జాకీలు పెట్టి లేపడం ఆ మీడియాకు అలవాటైన విద్య అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా తీసుకున్నారు. లోకేష్ ను జాకీలు పెట్టి లేపుతారు. పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి లేపుతారు అంటూ విమర్శించారు. నిన్న మీడియా సమావేశంలో జాకీల ప్రస్తావనే ఎక్కువగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబుకు ఎటువంటి సమర్థత లేదు.. లోకేష్ పరిణితి సాధించడం లేదు.. పవన్ కళ్యాణ్ పెద్దగా రాణించడం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. వారి నాయకత్వం లేచింది సొంత మీడియా జాకీలతోనే అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కానీ తన మీడియా తనను పైకి లేచింది మాత్రం జాకీలతో కాదన్న విషయాన్ని మరిచిపోయారు.
* ఆ ఫ్రస్టేషన్ తో
జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. మొన్న మధ్యన ఆ పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( Venkat Rama Reddy ) ఇంటర్వ్యూలో మాట్లాడారు. లోకేష్ ను చూసి జగన్ నేర్చుకోవాల్సింది ఉందంటూ వ్యాఖ్యానించారు. తరువాత ఆ వ్యాఖ్యలను సరి చేసుకొని లోకేష్ రెడ్ బుక్ కోసం, జగన్ క్విక్ లెర్నర్ అంటూ మాట మార్చారు. ఏదో అనుకున్నాం కానీ లోకేష్ అనుకున్నది సాధిస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. తద్వారా లోకేష్ ఏదో పరిణితి సాధించారన్న విషయం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటల్లో ధ్వనించింది. అయితే అది ఒక్క కేతిరెడ్డి మాటే కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ నేతల అభిప్రాయం కూడా అదే. తాము ఏ నోటితో అయితే లోకేష్ ను పప్పు ఉప్పు అని విమర్శించారో.. వారే ఇప్పుడు లోకేష్ పరిణితిని మెచ్చుకుంటున్నారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లి ఉంటుంది. అందుకే లోకేష్ సొంత డబ్బులతో వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని టీవీలో చూడొచ్చు కదా అంటూ చిల్లరపాటి మాటలు ఆడుతున్నారు.
* అందులో తప్పేంటి?
చంద్రబాబు ఉప ప్రధాని అయితే తప్పు ఏంటి? దానిని ఒప్పుకుంటే జగన్ అహం దెబ్బతింటుందా? అంతెందుకు చంద్రబాబు కంటే జూనియర్ నరేంద్ర మోడీ. ఆయన ప్రధాని కాలేదా? అంతెందుకు రాజశేఖరరెడ్డి తో సమకాలీకులు మంత్రులుగా ఉండగా.. జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేదా? కానీ చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థి. ఆయనకు గుర్తింపు దక్కుతుంటే ఒక రకమైన కడుపు మంట. తాను రాజకీయంగా ఎదిగితే తన సొంత బలం. అదే ప్రత్యర్ధులు ఎదిగితే జాకీలు పైకి లేపడం. జగన్మోహన్ రెడ్డి మాటల్లో ధ్వనించింది అదే. రాజకీయ ప్రత్యర్థుల ఎదుగుదలను ఆహ్వానించాలి. అంతకుమించి తాము ఎదిగి చూపించాలి. అది చేయలేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఆయనకే నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇటువంటి మాటలు వైసీపీ శ్రేణులకు నచ్చవు. ఆ పార్టీ అధినేత తలకు ఎక్కవు.