YouTuber Ravan: ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన యూట్యూబర్ రావణ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అతడి నిజ వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నాయి. ఆయన కేవలం ప్రశ్నించడానికి మాత్రమే ఛానల్ పెట్టుకున్నానని చెప్పిన ఆయన.. ప్రశ్నను పక్కనపెట్టి కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. నారా లోకేష్.. ఇతర వ్యక్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్.. ఇతర సోషల్ మీడియా మాధ్యమాలను వాడుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ రావణ్ ఒక వర్గాన్ని తీవ్రంగా విమర్శించారనే అభియోగాలు ఉన్నాయి.
రావణ్ హిందువుల మీద.. హిందూ దేవుళ్ళ మీద.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ఇష్టానుసారంగా మాట్లాడారు. హిందువుల పండుగల మీద పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా హిందువుల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగించాయి. దీనికి తోడు ఉగ్రవాదులకు ఆయన సంఘీభావంగా మాట్లాడారు. దేశాన్ని ప్రేమించనని.. బాహటం గానే చెప్పేశారు. పైగా మావోయిస్టు నేత హిడ్మా మీద సానుకూల వ్యాఖ్యలు చేశారు. యువత పోరాటాలు చేయాలని.. సాయుదులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా రావణ్ యూట్యూబ్ వీడియోలలో కనిపించాయి. దీంతో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు.
రావణ్ కేసులు విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రావణ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు నిలుపుదల చేశారు. ప్రశ్న అనే వెబ్సైట్ ద్వారా అతడు నెలకు 1.50 లక్షలు సంపాదిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రావణ్ ఫోన్ నుంచి వాట్సప్ చాట్ రికవరీ చేశారు. అందులో నుంచి కీలక విషయాలు వెలుగు చూసాయి.. అయితే ఇతడి వెనుక ఎవరి హస్తముంది.. ఎవరు ఇతడితో ఆ పని చేస్తున్నారు.. వారి లక్ష్యం ఏమిటి అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ మీద.. సనాతన ధర్మం మీద రావణ్ ఇష్టానుసారంగా మాట్లాడారు. జనసేన నాయకులు అనక పోలీస్ స్టేషన్లో రావడం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
