AP Elections 2024: “ఎగ్జిట్ పోల్స్”ను ప్రభావితం చేసే పనిలో వైసిపి

ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే ఎన్నికలకు ముందు సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సర్వేల్లో అధికార వైసిపి దూకుడుగా ఉండగా.. మరికొన్ని సర్వేలు మాత్రం టిడిపి కూటమికే ఛాన్స్ అని తేల్చేశాయి.

Written By: Dharma, Updated On : May 31, 2024 9:51 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: అసలు సిసలు రోజు సమీపిస్తోంది. అసలైన ఘట్టానికి సమయం ఆసన్నమౌతోంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఈనెల 13న పోలింగ్ ముగియగా.. మూడు వారాల తర్వాత ఫలితాలు రానుండడంతో అందరూ టెన్షన్ తోనే గడిపారు. ఫలితాలకు ముందే.. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. అయితే ఇలా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే సంస్థల్లో కొన్నింటికే క్రెడిబిలిటీ ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే ఎన్నికలకు ముందు సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్ని సర్వేల్లో అధికార వైసిపి దూకుడుగా ఉండగా.. మరికొన్ని సర్వేలు మాత్రం టిడిపి కూటమికే ఛాన్స్ అని తేల్చేశాయి.

అయితే ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించడంతో.. కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయని సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు ఇవ్వనున్నాయని తెలుస్తోంది. అదే జరిగితేకౌంటింగ్ వరకు వైసిపి శ్రేణులను తీసుకెళ్లడం అసాధ్యమని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు వైసీపీ ఆశ్రయించినట్లు సమాచారం. అనుకూల ఫలితాలు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను భారీగా ముట్ట చెప్పేందుకు కూడా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో పాటు సర్వేలకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చింది.ముఖ్యంగా ఎన్నికలకు ముందు దాదాపు 100 యూట్యూబ్ ఛానల్ లను వైసిపి తన ఆధీనంలోకి తీసుకుందని.. వీరు మోసిన విశ్లేషకులు సైతం వైసీపీకి సేవలందించారని.. ఇందుకు భారీగా ఖర్చు పెట్టిందని కూడా టాక్ నడిచింది. అటు చాలామంది విశ్లేషకులు వైసిపికి అనుకూలంగా విశ్లేషణలు చేసిన విషయం కూడా తెలుస్తోంది. అసలు దేశంలో వినిపించనిసర్వే సంస్థలు కూడా ఏపీ విషయంలో కలుగజేసుకున్నాయి.వైసీపీకి ఏకపక్ష విజయాలను కట్టబెట్టాయి.చివరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సైతం వైసీపీ దే విజయం అని తేల్చాయి.దీని వెనుక వైసిపి ప్రలోభాల పర్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వైసీపీకి వ్యతిరేకంగా వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆ పార్టీ భావిస్తోంది.అందుకే ఏకంగా ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలను ప్రభావితం చేసే పనిలో ఉందని తెలుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.