https://oktelugu.com/

Kutty Padmini: బాల నటిగా ఉన్నప్పుడే లైంగిక వేధింపులు, బుల్లితెర పరిశ్రమలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది… సంచలనం రేపుతున్న నటి కామెంట్స్!

జస్టిస్ హేమ కమీషన్ నివేదిక చలన చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. తాజాగా ఓ సీనియర్ నటి చిన్నప్పుడే తాను పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురయ్యానని అన్నారు. బుల్లితెర పరిశ్రమలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి..

Written By:
  • S Reddy
  • , Updated On : August 31, 2024 / 10:24 AM IST

    Kutty Padmini

    Follow us on

    Kutty Padmini: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అసమానత, అన్యాయాలపై నివేదిక రూపొందించింది జస్టిస్ హేమ కమీషన్. సుదీర్ఘ కాలం పలువురు నటీమణులను, నటులను సంప్రదించి హేమ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. హేమ కమిటీ రిపోర్ట్ లో దిగ్భ్రాంతికర విషయాలు ఉన్నాయి. మిగతా చిత్ర పరిశ్రమలతో పోల్చితే కోలీవుడ్ లో మహిళలు అధికంగా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని ఆ నివేదిక తేల్చింది.

    అవకాశాల పేరుతో మహిళల మీద లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. అసమానతలు ఉన్నాయి. మహిళలకు భద్రత లేదు. తమపై జరిగే వేధింపుల గురించి బయటకు చెప్పడం లేదు. కెరీర్ ఉండదనో, పరువు పోతుందనో మహిళలు లైంగిక దాడుల పై మాట్లాడటం లేదని ఆ కమిటీ తేల్చింది.

    హేమ కమీషన్ రిపోర్ట్ ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సమర్ధించింది. అయితే ఎవరో కొందరు చేసిన తప్పులకు మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని అన్నారు. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అమ్మ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులు వేధింపులకు గురయ్యామంటూ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సీనియర్ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తో పాటు కొందరు నటులు, దర్శక నిర్మాతలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    తాజాగా నటి కుట్టి పద్మిని షాకింగ్ ఆరోపణలు చేసింది. సినిమానే కాదు బుల్లితెర పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని ఆమె అన్నారు. బాల నటిగా ఉన్నప్పుడు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె ఓపెన్ అయ్యారు. పద్మిని మాట్లాడుతూ… డాక్టర్స్, ఇంజనీర్స్ మాదిరి యాక్టింగ్ కూడా ఒక వృత్తి. కాకపోతే ఇక్కడ లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు వాటిని నిరూపించలేమని, మరికొందరు కెరీర్ కోల్పోతామని, ఇంకొందరు అధిక సంపాదన వదులుకోలేక సర్దుకుపోతున్నారు.

    వెండితెరతో పాటు బుల్లితెర పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. బాల నటిగా ఉన్నప్పుడే నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయం అమ్మకు చెప్పానని మూవీ నుండి తప్పించారు. నటి శ్రీరెడ్డికి నడిగర్ సంఘం మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం లేదు. ఆమె సీరియల్స్ లో కూడా నటించలేకపోతుంది. సురేష్ గోపి వంటి నటుడు లైంగిక వేధింపులకు ఆధారాలు ఉన్నాయా? అని అడుగుతున్నాడు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేస్తే నిజాలు బయటకు వస్తాయి, అని అన్నారు. బాల నటిగా కెరీర్ ఆరంభించిన పద్మిని పలు చిత్రాలు, సీరియల్స్ లో నటించింది. ఆమె నిర్మాత కూడాను.